బావబామ్మర్దుల అనుభందం..అందరూ కుళ్లుకోవాల్సిందే ?
* లోకేష్ కు బ్రాహ్మినిని ఇచ్చి పెళ్లి చేసిన బాలయ్య
* ప్రతి పండుగను బాబు కుటుంబంతో చేసుకుంటున్న బాలయ్య
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో నందమూరి కుటుంబానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. అయితే నందమూరి కుటుంబంలో... సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నందమూరి బాలయ్యకు మంచి క్రేజ్ వచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బాల్య నటుడిగా పరిచయమైన నందమూరి బాలయ్య... ఆ తర్వాత స్టార్ హీరోగా మారిపోయాడు.
స్టార్ హీరోగా మారిపోవడమే కాకుండా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు బాలయ్య. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడుతో... కుటుంబ సంబంధాన్ని కొనసాగిస్తూ... రాజకీయాల్లో నందమూరి బాలయ్య కొనసాగుతున్నారు. అచ్చం సీనియర్ ఎన్టీఆర్ లాగానే... తన కూతురిని... చంద్రబాబు కొడుకు ఇచ్చి పెళ్లి చేశారు బాలయ్య. నందమూరి బాలయ్య కూతురు బ్రాహ్మిని, లోకేష్ వివాహం ఐ దాదాపు 15 సంవత్సరాలు దగ్గరికి వచ్చింది.
వారిద్దరికీ దేవాన్ష్ కుర్రాడు కూడా ఉన్నాడు. ఈ తరుణంలోనే నారా చంద్రబాబు నాయుడుకు ఎలాంటి కష్టం వచ్చినా బాలయ్య ముందుండి... ఆ సమస్యలను తొలగిస్తారు. ముఖ్యంగా వైసిపి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో... చంద్రబాబు కుటుంబం అనేక ఇబ్బందులు పడింది. చంద్రబాబు నాయుడు జైలుకు కూడా వెళ్లడం జరిగింది. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి అండగా నిలిచారు బాలయ్య.
ప్రతి పండుగను నందమూరి బాలయ్య అలాగే చంద్రబాబు నాయుడు... కలిసి జరుపు కుంటారు. పుట్టిన రోజు అయిన, పెళ్లి రోజు అయినా... ఏ పండుగ జరిగిన... అందరూ మాట్లాడుకునేలా పండుగ చేసుకుంటారు. ఇక తాజాగా... నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాల పండుగను కూడా... గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు కూడా వస్తున్నారు.అంతేకాదు.. సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు.