పవన్‌ కళ్యాణ్‌ పొలిటికల్‌ జర్నీ..మనల్ని ఎవడ్రా ఆపేది ?

Veldandi Saikiran
* 2014 లో జనసేన పార్టీ ఆవిర్భావం
*  ప్రజా రాజ్యం నుంచే పవన్‌ యాక్టివ్‌ పాలిటిక్స్‌
*  జనసేన ద్వారా అనేక అవమానాలు
* 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి జనసేన
* డిప్యూటీతో పాటు 4 మంత్రి పదవులు


రెండు తెలుగు రాష్ట్రాలలో... చాలామంది సెలబ్రిటీలు రాజకీయాల్లోకి వస్తున్నారు. అందులో కొంతమంది సక్సెస్ అవుతుంటే మరి కొంతమంది అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ అయిన రాజకీయ నాయకులు ఎక్కడ కనిపించలేదు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే క్రేజ్ తో ముందుకు వెళ్తున్నాడు. జనసేన పార్టీ పెట్టిన పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది.

2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీని ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అప్పటినుంచి   2024 వరకు... ఏపీలో రెండు ప్రభుత్వాలు మారాయి. రెండు ప్రభుత్వాలపైన పోరాటం కూడా పవన్ కళ్యాణ్ చేశారు. అలా దాదాపు పది సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగమైంది.

ఈ పది సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ చాలా అవమానాలు భరించారు. చంద్రబాబు నాయుడును మొదట నమ్మి మోసపోయిన పవన్ కళ్యాణ్... ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక ఇబ్బందులు పడ్డారు.  ముగ్గురు భార్యలు అని చాలా అవమానాలు ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాలలో పవన్ కళ్యాణ్ దారుణంగా ఓడిపోయారు. చేతిలో డబ్బు కూడా లేకుండా పోయింది. సినిమాలు ఆడకుండా చేశారు.

కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గలేదు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని రంగంలోకి దింపి మరి... పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం ఏపీలో 21 స్థానాలు గెలుచుకున్న జనసేన పార్టీ 2 ఎంపీలను కూడా గెలుచుకోగలిగింది. అటు ఒక ఎమ్మెల్సీ పదవి కూడా జనసేనకు దక్కింది. అదే సమయంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు. కందుల దుర్గేష్ కు కూడా మంత్రి పదవి ఇప్పించగలిగారు. ఇలా జీరో నుంచి హీరో అయ్యారు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: