పార్టీ మారనని చెప్పి వైసీపీ కేడర్ ఆశలపై నీళ్లు చల్లిన రోజా..!
అనంతరం సోషల్ మీడియాలో వైసీపీ పేరు ... జగన్ బొమ్మ కనిపించకుండా తన బయో అప్డేట్ కూడా చేసుకున్నారు. దీంతో రోజా పార్టీ మారిపోతున్నారని వైసీపీ నేతలు ఒక్కటే సంతోషపడ్డారు. కానీ వారి ఆశలపై రోజా నీళ్లు చెల్లారు. గత కొద్దిరోజులుగా ఏపీలో ఆమె రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నారని ...వైసీపీని వీడుతున్నారని తమిళ రాజకీయాలకు వెళతారని అక్కడ విజయ్ పార్టీ నుంచి పోటీ చేస్తారంటే ఒకటే ప్రచారం జరిగింది. తమిళనాడులో ఇప్పటికే టెంపుల్ టూర్ చేసిన రోజా తాజాగా తిరుమలకు వచ్చారు.. తిరుమలకు వచ్చిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
తాను వైసీపీని వీడట్లేదని ప్రకటించారు. ఈ ప్రకటన చూసిన వైసిపి లీడర్లు .. కేడర్లు చివరకు రాష్ట్రస్థాయి నాయకులలో కూడా పెద్ద నిరుత్సాహం ఏర్పడింది అని అనుకున్నాము.. రోజా బయటకు పోతుందని అనుకున్నామే.. ఆమె ఇంకా పార్టీలోనే ఉంటుందా ? అని ఉసూరు మంటున్నారు. అసలు నగరిలో కూడా ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ... రెండుసార్లు కూడా అతి తక్కువ ఓట్లతోనే ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ముద్దుకృష్ణమనాయుడు పై కేవలం 700 ఓట్ల తేడాతో గెలిస్తే ... 2019లో ముద్దు కృష్ణమ తనయుడు భాను ప్రకాష్ పై కేవలం 2000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కానీ మొన్నటి ఎన్నికలలో రోజా వ్యవహార శైలి ముదిరిపోయి పాకన పడటంతో 40 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయారు. ఆమెకు అసలు వర్గమే లేకుండా పోయింది. అయితే నగరి తప్ప ఆమెకు మరో చోటు లేదు.. ఏది ఏమైనా రోజా వైసీపీలో ఉంటానని చెప్పటం వైసిపి వాళ్ళకి కాస్త బాధగా ఉంది.