ఉచితాల ఎఫెక్ట్: పధకాలన్నీ కట్... దివాలా అంచుల్లో హిమాచల్ ప్రదేశ్..?

FARMANULLA SHAIK
హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక వివేకం పథంలో దూసుకుపోవాల్సిన అవసరం ఉందని , గత బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి, హేతుబద్ధం చేస్తుందని హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు చెప్పారు.ఉచితాల ప్రభావం రాష్ట్రాలను అప్పుల్లోకి నెడుతున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పొలిటికల్ పార్టీలు ఉచితాలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో దారుణంగా విఫలం అవుతున్నాయి.అందుకు కారణం రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండటం. ఇచ్చిన హమీలన్నీ పూర్తి చేయాలంటే తిరిగి అప్పులు చేయాల్సిందే. ఇప్పుడు అదే పరిస్థితి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు అందుకు అద్దం పడుతున్నాయి.తాజాగా హిమాచల్ ప్రదేశ్‌ దివాలా అంచులకు చేరింది. గత ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత పథకాలే అందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ రూ.58వేల కోట్లుగా ఉండగా.. అప్పులు 95వేల కోట్లకు చేరాయి. జీతాలు, పింఛన్లకే రూ.42వేల కోట్లు పోతోంది.ఇక వడ్డీలు, అప్పులు తీర్చేందుకు, అభివృద్ధికి డబ్బులే మిగలడం లేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచితాల్లో 50 శాతం కోత విధించాలని భావిస్తోంది. ప్రస్తుతం అక్కడ ఉచిత కరెంటు, మహిళలకు రూ.1500, బస్సుల్లో 50శాతం డిస్కౌంట్ ఇస్తుండగా.. ఇప్పుడు వాటిలో కోత పెట్టనున్నారు.ఈ నేపథ్యంలోనే మేము ఈ అప్పును భాజపా నుండి వారసత్వంగా పొందాము, ఊహించుకోండి, అభివృద్ధి పథకాల కోసం కాదు, ఈ అప్పుపై అసలు మరియు వడ్డీ చెల్లించడానికి మేము రుణం తీసుకోవలసి వచ్చింది," అని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను సంపాదించడానికి మద్యం విక్రయాల వేలం వంటి చర్యలను కూడా ప్రవేశపెట్టింది. బీజేపీ ఎక్సైజ్ పాలసీ ప్రకారం 5 ఏళ్లలో రూ.600 కోట్లు ఆర్జించగా, వేలంతో ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ రూ.485 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలిగింది. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేసిందని హిమాచల్ ప్రభుత్వం ఆరోపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: