ఏపీ: పత్తలేని డిప్యూటీ సీఎం.. అసలు నిజం బయటపడిందా..?

Divya
రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా అల్లకల్లోలం ఏర్పడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో  రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా జలదిగ్బంధంతో మునిగిపోయింది. కాపాడేందుకు కూడా అధికార యంత్రాంగం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న కానీ అవ్వడం లేదట. కేంద్ర, రాష్ట్ర అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు వచ్చి ప్రజలను కాపాడడానికి ముందుకు వచ్చాయి. అలాగే మాజీ సీఎం జగన్, బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి తమకు తోచిన విధంగా సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారిన జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం అసలు ఎక్కడ కనిపించడం లేదట.

కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో వానలు ఎక్కువగా పడుతూ ఉండడంతో విజయవాడ మొత్తం మునిగిపోయింది. ఇప్పటికే స్కూళ్లకు కాలేజీలకు సైతం సెలవులు కూడా ఇచ్చేశారు.. ఉప ముఖ్యమంత్రి జాడ ఎక్కడ కనిపించడం లేదని పలువురు నేతలు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. జనసేన పార్టీ ప్రజలకు అండగా ఉంటానని చెప్పి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఎలాంటి విషయాల పైన కూడా స్పందించలేదంటూ తెలియజేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు వరదలతో అల్లాడుతుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం అటు నేతలలో కార్యకర్తలలో కూడా తీవ్ర చర్చనియాంశంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రశ్నిస్తానంటూ ఆవేశంతో చెలరేగిపోయిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలలో మాత్రం ప్రశ్నలుగా మిగులుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉండి కూడా ఎలాంటి సహాయం చేయలేదని చాలామంది పవన్ కళ్యాణ్ పైన ఫైర్ అవుతున్నారు. కనీసం అధికారులతో కూడా మాట్లాడి సహాయ చర్యలను సైతం రప్పించే విధంగా ఎలాంటి పనులు చేయలేదని వాపోతున్నారు. కనీసం కార్యకర్తలకు కూడా సహాయం చేయండి అంటు ఆదేశాలను కూడా ఇవ్వలేదు డిప్యూటీ సీఎం. అంతేకాకుండా ఇప్పటికే 20 మందికి పైగా ఏపీలో మృతి చెందినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మరి కొంతమంది పవన్ కళ్యాణ్ అసలు నిజ స్వరూపం ఇదే అంటూ తెలియజేస్తున్నారు. నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తన కుటుంబానికి పరిమితమైనట్ల వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: