వరద రాజకీయాలు: చంద్రబాబును లేపుతున్న కేసీఆర్?

Veldandi Saikiran
* చంద్రబాబును మెచ్చుకుంటున్న బీఆర్‌ఎస్‌
* 70 ఏళ్లు దాటిని వరదల్లో తిరుగుతున్న బాబు
* వరద బాధితులను పట్టించుకోని రేవంత్‌
* ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నా వృధానే

రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు బీభత్సం గా కొడుతున్న సంగతి తెలిసిందే. మొన్న శనివారం రోజు నుంచి ఇవాల్టి వరకు... తెలంగాణ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.  దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రాజెక్టులు అన్నీ నిండుకుండలా కనిపిస్తున్నాయి. అదే సమయంలో వరదలకు ప్రాణనష్టం అటు ఆస్తి నష్టం కూడా వాటిల్లింది.

ముఖ్యంగా ఖమ్మం, ఏపీలోని విజయవాడ నగరాలు వరదలకు మునిగిపోయాయి. దీంతో చాలామంది వరదలకు చిక్కుకొని మరణించారు. అయితే వరదలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొందరగా అలర్ట్.. ప్రజలను కాపాడిందని చెప్పవచ్చు. కానీ తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర పోయిందని... గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. విజయవాడ నగరంలో వరదలు అల్లకల్లోలం సృష్టించడంతో... ఆదివారం అర్ధరాత్రి 4 గంటల వరకు సీఎం చంద్రబాబు నాయుడు పనిచేశారు.

విజయవాడ ప్రజలను రక్షించిన తర్వాతే తను ఇంటికి వెళ్తానని శపథం చేశారు.70 సంవత్సరాలు దాటిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... ప్రత్యేకంగా హెలికాప్టర్లు తీసుకువచ్చి మరి ప్రజలను కాపాడారు.  దీంతో దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు హైలెట్గా మరోసారి నిలిచారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా వేరుగా ఉందని విమర్శలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం... వరద బాధితులను కాపాడడంలో అట్టర్ ఫ్లాప్ అయిందని చెబుతున్నారు.
 

ఆదివారం ఖమ్మం జిల్లాను వరదలు ముంచేతితే... ఆ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు.. హైదరాబాదులో జల్సాలు చేశారని గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తుంది.  రేవంత్ రెడ్డి కూడా సండే హాలిడే అన్నట్లుగా వ్యవహరించారని... గులాబీ పార్టీ ఫైర్ అవుతోంది.  పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... ఏజ్ పైబడినప్పటికీ ప్రజల కోసం కష్టపడ్డారని... రేవంత్ రెడ్డి పై గులాబీ పార్టీ మండిపడుతోంది. ఎప్పుడు చంద్రబాబును తిట్టే గులాబీ పార్టీ...  ఈ విషయంలో మాత్రం పొగడ్తలతో ముంచేత్తుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: