ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు భారీగా కురుస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి. అలాగే ఇప్పటికే ఎంతో మంది వరదల్లో కొట్టుకపోయి ప్రాణాలను కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అలాగే వరద భయంతో బిక్కు బిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తున్న వారు కూడా ఉన్నారు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వరద ఉధృతి ఎక్కువగా ఖమ్మం జిల్లాలో ఉంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే వర్షాలు భారీగా పడుతూ ఉండటంతో వరదలు భారీగా వస్తున్నాయి.
దానితో అనేక మంది ఇక్కడ ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. ఇక ఈ ప్రాంతం నుండి అనేక మంది మంత్రులు ఉన్నారు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకరు. ఈయన ఖమ్మం జిల్లా వాసి. అలాగే ఖమ్మం జిల్లా నుండి అనేక సార్లు అనేక ఎన్నికలలో పోటీ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున అసెంబ్లీ స్థానాలు రావడం జరిగింది. దానితో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఉత్తమ్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక వ్యక్తి కావడంతో ఈయనకు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో నీటిపారుదల , పౌర సరఫరాల శాఖ మంత్రి పదవులు దక్కాయి. ఇక ఈయన కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన నేతలలో ఒకరు కావడం , అలాగే ఎంతో ప్రతిష్టాత్మకమైన మంత్రి పదవి లో ఉండడం వల్ల ఈయన జిల్లాలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ప్రతిపక్షాలు ఉత్తమ్ ను స్పెషల్ టార్గెట్ చేస్తున్నాయి.
ఉత్తమ్ ది ఖమ్మం జిల్లా. ఆయన జిల్లాలోనే వరదలు ఉదృతంగా వస్తున్నాయి. అయినా ప్రభుత్వం ఏమీ చేయలేక పోతుంది. జిల్లాలో వరద ఉధృతి వల్ల ఎంతో మంది ప్రజలకు ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. వెంటనే వాటిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలి అని ప్రతిపక్ష నేతలు ఉత్తమ్ పై మాటల దాడి చేస్తున్నారు. ఇలా ఖమ్మం జిల్లా వాసి కావడంతో ఉత్తమ్ పై ప్రతిపక్షాల నుండి గట్టి కౌంటర్లు ఇస్తున్నాయి. దీనిపై ఉత్తమ్ కూడా ప్రతిపక్షాలకు తనదైన స్థాయిలో స్పందిస్తూ వస్తున్నాడు.