తెలంగాణ గవర్నర్‌ గా టీడీపీ లీడర్‌ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పదవుల పంపకాలు... జరుగుతున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమితి మన అందరికీ తెలిసిందే. జనసేన, భారతీయ జనతా పార్టీ,తెలుగుదేశం పార్టీలు కలిసి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 160 కి అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న తెలుగుదేశం కూటమి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అయితే ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వెంటనే కేబినెట్ విస్తరణ కూడా చేశారు చంద్రబాబు నాయుడు. అయితే ఏపీ కొత్త కేబినెట్ లో  దాదాపు కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులు... భర్తీ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే...  తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అశోక్ గజపతిరాజు పరిస్థితి ఏంటని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు.
 
అశోక్ గజపతి రాజుకు కచ్చితంగా ఈసారి ఏదో ఒక పదవి మాత్రం వస్తుంది. అయితే మొన్నటి వరకు తిరుమల దేవస్థానం చైర్మన్ పదవి వస్తుందని... అందరూ చర్చించుకున్నారు.  కానీ ఆ పదవిని టీవీ 5 అధినేత నాయుడు గారికి దక్కనుందట. దీంతో అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి వస్తుందని చెబుతున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం అశోక్ గజపతి రాజుకు ఉంది.
 
అందుకే ఆయనకు తెలంగాణ గవర్నర్ పదవి ఇవ్వాలని అనుకుంటున్నారట. మరో ఏడాది లోపు...తెలంగాణ గవర్నర్ పదవి అశోక్ గజపతి రాజుకు వచ్చేలా బిజెపితో చంద్రబాబు చర్చలు చేస్తున్నారట. ఈ పదవికి అశోక్ గజపతిరాజు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా మొన్నటి ఎన్నికల్లో విజయనగరం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు అశోక్ గజపతిరాజు. కానీ ఒక కుటుంబానికి ఒక్క టికెట్ అన్న కండిషన్ తో... ఆయన కూతురుకు టికెట్ దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: