టీడీపీ ఖాతాలో పెద్ద కార్పోరేషన్.. అదిరిపోయే ట్విస్ట్ ఇది..!

RAMAKRISHNA S.S.
- 9 మంది కార్పోరేట‌ర్లు జంప్ చేస్తే చేతులు మార‌నున్న కార్పోరేష‌న్‌
- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్ని వైసిపి చేజారిపోతున్నాయి. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వరుస పెట్టి కూటమి పార్టీలలో చేరిపోతున్నారు. ఎక్కువమంది తెలుగుదేశం.. ఆ తర్వాత జనసేన పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఇప్పుడు వైసీపీ నుంచి చేజారి తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడేందుకు రంగం సిద్ధమవుతోంది.
ఏలూరు కార్పొరేషన్ లో మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో 47 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. తెలుగుదేశం నుంచి ముగ్గురు కార్పొరేటర్లు విజయం సాధించారు.

2014లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మేయర్ అయిన తెలుగుదేశం నాయకురాలు ఎస్కే నూర్జహాన్ ఆ తర్వాత 2021లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మళ్లీ మేయర్ అయ్యారు. ఆమె భర్త ఎస్ఎంఆర్ పెదబాబు కూడా మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుడు అయ్యారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. మేయర్ నూర్జహాన్, ఆమె భర్త పెదబాబు ఇద్దరు తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే 14 మంది వైసిపి కార్పొరేటర్లు కూడా తెలుగుదేశంలో చేరారు. కొత్తగా టీడీపీలోకి వచ్చిన 15 మందితో పాటు.. పార్టీ తరఫున గెలిచిన ముగ్గురు మొత్తం కలిసి 18 మంది కార్పొరేటర్లు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు అర్థం అయింది.

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరాలంటే.. మరో 9 మంది సభ్యులు వీరితో కలవాలి. ఒకేసారి 14 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. త్వరలోనే మరో పదిమంది వైసిపి కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొనేందుకు రంగం సిద్ధమవుతోంది. అదే జరిగితే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కీలకమైన పెద్ద కార్పొరేషన్ గా ఉన్న ఏలూరు కార్పొరేషన్.. తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడినట్టు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: