ఏపీ సిఎం: మంత్రులను భయపెట్టేలా నిర్ణయం..!
ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న పనిని మంత్రులు అధికారులు అందుకుంటున్నారా లేదా అనే చర్చ ఇప్పుడు కూటమిలో జరుగుతోందట. వాస్తవానికి చూస్తే చంద్రబాబు 10 అడుగులు వేస్తే ఆయనతోపాటు అడుగులు వేసేవారు ఎవరు లేరు అన్నట్లుగా చర్చలు జరుగుతున్నాయి. అని చంద్రబాబు చెప్పినట్లుగా మంత్రులు అధికారులు పనిచేస్తే సక్సెస్ అవుతాం అనుకున్నప్పటికీ కూడా.. చాలామంది సీఎం చంద్రబాబు చెప్పిన డైరెక్షన్‌ని కానీ దిశా నిర్దేశాలను కానీ ఎవరు పాటించడం లేదని అదే ఇప్పుడు కూటమిలో చర్చగా మారుతోంది.
ఈ విషయం అటు చంద్రబాబుకు చాలా కోపాన్ని తీసుకువచ్చేలా తెలుస్తుందట. తనతో పాటు అంతా కలిసి ఒక టీముగా సాగితేనే రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని ఈ విషయాన్ని ఒకటికి పది సార్లు చెబుతూ ఉన్న అటు అధికారులు నేతలు ఎవరూ కూడా పట్టించుకోలేదని దీంతో వీరిని క్షమించేది లేదంటూ కూడా హెచ్చరిస్తున్నారట.. తన అడుగుజాడల్లో నడవలేని మంత్రులను అధికారులను తనకు అక్కరులేదని చంద్రబాబు డైరెక్టుగా చెప్పేసినట్లు కూటమి లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాంటి వారిని తీసేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారట ఏపీ సీఎం. ఇలా హెచ్చరించారో లేదో కొన్నిచోట్ల మాత్రమే మంత్రులు అధికారులు పనిచేస్తున్నారట. మరి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతమందికి మేలు చేస్తుందొ చూడాలి