వరుస దెబ్బలతో కేసీఆర్ విలవిలా... ఫామ్‌హౌస్‌లో కన్నీళ్లు...!
వరుస ఎదురు దెబ్బలకు తోడు.. కాంగ్రెస్ పార్టీ చిన్నచిన్న లోపల పై ప్రజల పక్షాన పోరాటం చేసే అవకాశం.. బి.ఆర్.ఎస్ కు లభిస్తున్నా.. కేసీఆర్ మాత్రం గ్రౌండ్ లోకి దిగిపోవడం.. సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతుంది. మాట మాట్లాడితే రైతులు గురించి మాట్లాడే కెసిఆర్.. ఇటీవల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఈ టైంలోనూ కేసీఆర్ ఫామ్ హౌస్ ను వీడడం లేదు. సర్కార్‌ను ప్రశ్నిస్తూ రైతులకు అండగా ఉండాలని.. బయటకు వచ్చి ఓ ప్రకటన కూడా విడుదల చేయకపోవడం పట్ల.. పార్టీ శ్రేణులు నివ్వెరపోతున్నాయి. వరదలతో తెలంగాణ అతలాకుతలం అవుతుంటే.. కేసీఆర్ ఇక్కడ, కేటీఆర్ అమెరికాలో జల్సాలు చేస్తారంటూ ఇప్పటికే కాంగ్రెస్.. కేటీఆర్ ఫ్యామిలీ పై విమర్శల వర్షం కురిపిస్తుంది.
కాంగ్రెస్ లోపాలు కనిపిస్తున్నా కానీ.. బిఆర్‌ఎస్ నుంచి ఆశించిన స్థాయిలో ప్రతిఘటన లేదు. ఉన్నంతలో హరీష్ రావు మాత్రమే ఖమ్మం లాంటి చోట పర్యటిస్తూ పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ పర్యటన చేసే అవకాశం కళ్ళముందు కనిపిస్తున్న.. కేసీఆర్ మాత్రం స్లో అండ్ స్టడీ వ్యూహంతో ఉంటున్నారే తప్ప.. ప్రజల్లోకి వెళ్ళటం లేదు. కౌంటర్లు ఇవ్వడం లేదు. దీనివల్ల పార్టీ మరింత నష్టపోవడం తప్ప.. అసలు ప్రయోజనం ఉండదని రాజకీయ పరిశీలికలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే కెసిఆర్ ఇలాగే సైలెంట్ ఉంటే.. మరి కొంతమంది కీలక నేతలు కూడా పార్టీని విడి వెళ్లిపోయిన ఆశ్చర్యం లేదని బి.ఆర్.ఎస్ వర్గాలే చర్చించుకుంటున్నాయి.