వ‌ర‌ద‌లు త‌గ్గిన వెంట‌నే విజ‌య‌వాడ‌లో బాబు అతిపెద్ద ఆప‌రేష‌న్ ఇదే..!

RAMAKRISHNA S.S.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వరదలు విజృంభిస్తున్నాయి. విజయవాడ అయితే వరదల్లో చిక్కుకుని విల‌విల‌లాడుతోంది. ప్రస్తుతం అందరూ విజయవాడ ను జలవాడ అని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఆక్రమించేసి అడ్డగోలుగా కట్టిన నిర్మాణాలతో.. ఎంత ప్రమాదమో తాజాగా బయటపడింది. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ శరవేగంగా విస్తరిస్తోంది. వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ దోచుకు తినటమే పనిగా ఉండిపోయాయి. ఫలితంగా బుడమేరు కుంచిచుకు పోయింది. కబ్జాలు పెరిగిపోయాయి. దీనికి తోడు వరద ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ కారణంగా బుడమేరు ప్రవాహం సాగటం లేదు. మరోసారి ఇలాంటి పరిస్థితి వస్తే.. ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయి.

అందుకే ప్రభుత్వం బుడమేరును సంస్కరించాలని నిర్ణయించింది. బుడమేరులో కబ్జాల‌ లెక్క తీసి ఎవరెవరు అమ్ముకున్నారు.. ఎవరెవరు కొనుగోలు చేశారు.. మొత్తం కేసులు పెట్టి బుడమేరు పరిధిలో ఉన్న ఇల్లు అన్ని కూల్చివేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సామాన్యులు ఎవరైనా ఆ ఇల్లు కొనుగోలు చేసి ఉంటే.. వారికి ఆ ధ‌ర‌ వచ్చేసి.. అమ్మినవారి వద్ద నుంచి ఆ డబ్బులు వసూలు చేసి.. పరిహారం ఇప్పించాలన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. వైసీపీ నేతలు.. మరీ ముఖ్యంగా అప్పుడు మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు.. కొంతమంది ప్రజాప్రతినిధులు బుడ‌మేరు మీద పడ్డారని.. అనేకసార్లు మీడియా కూడా వెలుగులోకి తెచ్చింది.

అయితే క‌బ్జాలు మా హక్కు అన్నట్టుగా ఎంతమంది ఎన్ని ఫిర్యాదులు చేసినా.. అప్పటి వైసిపి ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా సొంత పార్టీ నేతలు క‌బ్జాలు చేస్తుంటే.. వారిని ఎంకరేజ్ చేసింది. ఫలితంగా ఐదేళ్లపాటు నిరంతరాయంగా ఈ ఆక్రమణలు సాగాయి. ఇప్పుడు అదే వైసిపి నేత వచ్చి బుడమేరు గురించి కథలుగా చెబుతున్నారు. కనీసం జగన్‌కు అవగాహన లేదు. కాబట్టి కబ్జాలు పైన అయినా స్పష్టత లేదు. ఆయనకు రావాల్సిందేదో రావాల్సిందే కానీ.. ముందు ముందు అసలు సినిమా చూపించటం ఖాయంగా కనిపిస్తోంది. ఏది ఏమై బుడ‌మేరు ఆక్ర‌మ‌ణ విష‌జ్ఞంలో వైసిపి నేతలు జాతకాల గుట్టు బయట పెట్టేందుకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: