పవన్ కళ్యాణ్ తెలంగాణను వదిలేసినట్టేనా..?
ఇక తర్వాత మళ్లీ ఎలాంటి విషయాలను కూడా పట్టించుకోరు. తాజా పరిణామాలను చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా తెలంగాణను పూర్తిగా వదిలేసారేమో అన్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా ఏళ్లకు తాను నిలబెట్టిన ప్రతిచోట కూడా జనసేన సీటును ఏపీలో గెలుచుకునేలా చేశారు. దీంతో ఇక మీద తెలంగాణలో తన ఉనికి అవసరం లేదు అనుకున్నట్టుగా కనిపిస్తోంది.
ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలలో వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ఈ విషయం బయటపడింది. కేవలం పవన్ కళ్యాణ్ ఏపీకి వరదలు ముంచెత్తినప్పటికీ పత్తా లేకుండా పోయారని విధంగా పలు రకాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నానా హంగామా జరిగింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడం చేత కూడా ప్రపంచానికి ఆయన అందుబాటులో ఉండకుండా ఉన్నారు. కానీ ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ జగన్ పాలన వల్లే బుడమేరు కాలువ నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం వచ్చిందనే విధంగా తెలిపారు. ఇక అలాంటి సమయంలోనే ఏపీకి కోటి రూపాయలు సహాయం నిధి కింద విరాళం కూడా ప్రకటించుకున్నారు అయితే తెలంగాణకు మాత్రం ఏ విధంగా ప్రకటించలేదట.. కానీ ఇరు రాష్ట్రాలలో వరదలు సంభవించి ఉన్నాయి.. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో కార్యకర్తలు అభిమానులు కూడా ఉన్నారు. దీంతో చాలామంది సెలబ్రిటీలు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సమానంగానే విరాళాలు ప్రకటించడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీకి ఒక్కటే కోటి రూపాయలు ప్రకటించారు.దీన్నిబట్టి చూస్తే పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలను వదిలేసుకున్నారని రూమర్స్ వినిపిస్తున్న సమయంలో.. తెలంగాణ నుంచి అటు జనసేన నేతలు కార్యకర్తలు అసంతృప్తితో ఉన్న సమయంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ స్వయంగా చెక్కును అందజేసినట్లు తెలియజేశారు.. అంతేకాకుండా కష్టాలలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే అండగా నిలబడాలని తెలియజేశారు పవన్ కళ్యాణ్.ఇలాంటి వాటికన్నిటికీ చెక్ పెట్టారు పవన్ కళ్యాణ్.