పెన్షన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.అధికారంలోకి వచ్చిన నుంచి కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తుంది. అటు ప్రజలను, ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.పింఛన్ల బదిలీకి అవకాశం కల్పించింది. పింఛన్ ట్రాన్స్ ఫర్ కు సంబంధించిన ఆప్షన్ను గ్రామ, వార్డు సచివాలయాలల్లో అందుబాటులో తెచ్చింది. పింఛన్ దారులు ఉపాధి కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అలాంటి వారు ప్రతినెలా మొదటి తారీఖున పింఛన్ కోసం స్వగ్రామానికి రావాల్సి వస్తుంది. పింఛన్ దారులు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా... పెన్షన్ ట్రాన్స్ఫర్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. లబ్దిదారులు సచివాలయంలో పింఛన్ బదిలీకి అప్లై చేసుకోవచ్చని తెలిపింది. ఏపీలోని ఇతర ప్రాంతాలకు పింఛన్ బదిలీ చేసుకోవాలనుకుంటే ఆ ప్రాంతం, సచివాలయ వివరాలు...స్వగ్రామంలోని సచివాలయంలో అందించాలి.ఏపీ కూటమి ప్రభుత్వం రాగానే పింఛన్లను భారీగా పెంచింది. పైగా పెంచిన పింఛన్లను ఏప్రిల్ నెల నుంచి అమలు చేసింది. పింఛన్లను రూ.4 వేలకు పెంచింది కూటమి ప్రభుత్వం. జులై నెలలో ఏకంగా రూ.7 వేల పింఛన్ అందించింది. పింఛన్లను నేరుగా ఇంటి వద్దే లబ్దిదారులకు అందిస్తున్నారు. తాజాగా ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి కోసం, ఇతర అవసరాల కోసం లబ్ధిదారుల రాష్ట్రంలోని ఇతర ప్రదేశాల్లో తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. పింఛన్ పొందేందుకు ప్రతి నెల సొంత ఊరికి రావాల్సి వస్తుందని, పెన్షన్ బదిలీకి అవకాశం కల్పించాలని ప్రభుత్వాని కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, పెన్షన్ బదిలీకి అవకాశం కల్పించింది.
పెన్షనర్లు ప్రస్తుతం తాము నివసిస్తున్న చోట పింఛన్ పొందేందుకు...ప్రస్తుతం పింఛన్ పొందుతున్న గ్రామ లేదా వార్డు సచివాలయంలో బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. సచివాలయాల్లో పెన్షన్ల బదిలీకి ఆప్షన్ ఇచ్చారు. దీంతో పింఛన్ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే సమయంలో పింఛన్ దారు ఐడీతో పాటుగా ఎక్కడికైతే ట్రాన్స్ ఫర్ చేయాలో దరఖాస్తులో... జిల్లా, మండలం, సచివాలయం పేర్లు, ఇతర వివరాలు అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంపై పింఛన్ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల సొంతూరుకు వచ్చి పింఛన్ తీసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఇకపై ఎక్కడ ఉంటే అక్కడే పింఛన్ తీసుకునేందుకు అవకాశం రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఏపీలో ప్రతి నెలా ఒకటే తేదీనే ఇంటి వద్దే 95 శాతం పింఛన్లు పంపిణీ చేస్తున్నామని కూటమి ప్రభుత్వం తెలుపుతుంది. సాంకేతిక సమస్యలతో కొందరికి ఒకటో తేదీన పింఛన్ అందడంలేదని, అలాంటి వారికి రెండో తేదీన కచ్చితంగా పింఛన్ అందుతుందని స్పష్టం చేస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు జీతాలు, పింఛన్ దారులకు నగదు ప్రతి నెల ఒకటో తేదీనే అందుతున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఇతర సంక్షేమ పథకాలు సైతం అమల్లో చేస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.