తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల లో గోదావరి పరివాహక ప్రాంతం అనేక కి లో మీట ర్లు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే . గోదావరి పరివాహ క ప్రాంతం గా ఉన్న ప్రదేశాల అంతా సాఫీ గా ఉన్నప్పుడు అద్భుతమైన రీతిలో ఉంటాయి . గోదావరి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల్లో అద్భుతమైన సారవంతమై న భూములు ఉండడంతో వారి జీవన శైలి అద్భుతంగా ఉంటుంది . కానీ అదే గోదావరి వరదల ద్వారా పొంగిం దో అప్పుడు మాత్రం ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు ఎనలేని కష్టాలు వస్తూ ఉంటాయి . ఇక ఇప్పటికే గోదావరి చుట్టు పక్కల ప్రాంతాలు ఎన్నో సార్లు వరదల ద్వా రా కష్టాలను ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి .
ఇకపోతే గోదావరి తెలంగాణ రాష్ట్రంలోని పూర్వపు అదిలాబాద్ జిల్లా , ప్రస్తుత మంచిర్యాల జిల్లా నుండి కూడా అనేక కిలో మీటర్లు వెళుతుంది. ఇక రెండు సంవత్సరాల క్రితం భారీగా వర్షాలు కురవడంతో గోదావరి నది ఉధృత స్థాయికి చేరుకుంది. నీటి మట్టం క్రమ క్రమంగా పెరుగుతూ రావడంతో మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో గోదావరి చుట్టు పక్కల ఉన్న అనేక ప్రాంతాలు , ఇల్లులు మునిగిపోయాయి.
దాని ద్వారా మంచిర్యాల్ పట్టణం లోని ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఇక ఇప్పటికీ కూడా వర్షాలు భారీగా కురుస్తున్నాయి అంటే గోదావరి ఎక్కడ ఉధృత స్థాయికి వెళుతుందో , ఎలాంటి పరిస్థితులు వస్తాయో అని మంచిరాల పట్టణం లోని ప్రజలు బిక్కు బిక్కు మంటూనే ఉంటారు. అలా గోదావరి తన ఉధృత రూపాన్ని చూపించినట్లు అయితే పూర్వపు అదిలాబాద్ జిల్లా , ప్రస్తుత మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల పట్టణ ప్రజలు చాలా వరకు కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.