విజయవాడలో వరద.. జగన్ కామెడీకి జనాల నవ్వులు.. !

RAMAKRISHNA S.S.
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రెడ్డి.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రజల్లోకి వచ్చేందుకు ఇష్టపడలేదు. ఎప్పుడైనా ప్రజల్లోకి వెళితే చుట్టూ పరదాలు కట్టుకుని మరి వెళ్లేవారు. జగన్ అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉంటేనే జనాల్లోకి వెళ్లేందుకు.. జనాల సాధక బాదకాలు తెలుసుకునేందుకు ఎంత మాత్రం ఇష్టపడేవారు కాదు. అలాంటిది జగన్ ప్రతిపక్షంలో ఉంటే జనాల బాధలు ఎందుకు పట్టించుకుంటారు. జనాల్లోకి ఎందుకు వెళ్తారు.

కేవలం రాజకీయం చేయటానికి మాత్రమే జగన్ ప్రతిపక్ష నేతగా పనికి వస్తారే తప్ప.. అసలు జగన్ ప్రజల పక్షాన పోరాటం చేయాలని ఏనాడు అనుకోరు అన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా విజయవాడ వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్.. బుడమేరు ఉన్నది.. ఆ నదిపై ఉన్న రెగ్యులేటర్ 11 గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది. అందుకే రాత్రికి రాత్రే గేట్లు ఎత్తేశారు. దీంతో వరద వచ్చింది అని జగన్ వ్యాఖ్యలు చేశారు. ఇది విన్న విజయవాడ జనాలు ఆశ్చర్యానికి గురయ్యారు. నా ఆరోపణలు అసత్యం ఎక్కడ ఉందని జగన్ ప్రశ్నిం ?చడంతో.. మరింత విస్తు పోయారు.

ఎక్కడ బుడ‌మేరు.. ఎక్కడ కృష్ణానది.. బుడమేరు నది కాదు వాగు.. అది ఓ డ్రైన్, కృష్ణ జీవనది. డ్రైన్‌లో నీరు నదిలో పెడితే సీఎం చంద్రబాబు ఇల్లు ఎలా మునుగుతుందా ? అని అర్థం కాక.. జగన్ మాటలకు జనాలు నవ్వుకుంటున్నారు. పైగా జగన్ జనాలను పరామర్శించేందుకు పాత రాజరాజేశ్వరి పేటలోకి వచ్చారు. ఈ కార్యక్రమం సినిమా షూటింగ్‌ను తలపించింది. కాలనీ ప్రధాన రహదారిపై నుంచి 500 మీటర్ల దూరం వెళ్లకుండానే పరామర్శ పూర్తి చేసి వెళ్లిపోయారు. జగన్ ఎవరెవరితో మాట్లాడాలో వైసీపీ నేతలు ముందుగానే ఏర్పాట్లు చేశారు. కొంతమంది మహిళలు ఒక దివ్యాంగుడు, ఒక చిన్నారిని కలిసేలా చూశారు. దీనిని బట్టి జగన్‌కు జనాల పట్ల ఎంత అభిమానం ఉందో.. సమాజం పట్ల ఎంత బాధ్యత ఉందో క్లియర్గా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: