చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ కీలక సమావేశం ?
సోషల్ మీడియా వేదికగా... ఆ రెండు కుటుంబాలకు ఏదైనా పండుగ జరిగితే శుభాకాంక్షలు చెప్పడం తప్ప... వాళ్ల ఇంటికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్లడం లేదు. మొన్నటికి మొన్న నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాల పండుగకు కూడా... జూనియర్ ఎన్టీఆర్ వెళ్లలేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో.. జూనియర్ ఎన్టీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో... జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కాబోతున్నారట.
రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు బీభత్సం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం అలాగే విజయవాడలో వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ హీరోలు విరాళాలు ప్రకటించారు. ఇందులో భాగంగానే మొదటగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించి వెంటనే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు... విరాళం ప్రకటించేశారు. జూనియర్ ఎన్టీఆర్ విరాళం ప్రకటించిన తర్వాత ఇండస్ట్రీ నుంచి హీరోలందరూ స్పందించి వెంట వెంటనే... విరాళం ఇచ్చేశారు.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు అందరూ... తాము ప్రకటించిన విరాళాలను నేరుగా చంద్రబాబు నాయుడుకు ఇవ్వాలని అనుకుంటున్నారట. అయితే... ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా వారితో వెళ్ళనున్నారట. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ ఆయనను కలవలేదు. అందుకే టాలీవుడ్ పెద్దలతో కలిసి చంద్రబాబును కలవాలని జూనియర్ ఎన్టీఆర్ ఈ స్కెచ్ వేశారట. ప్రభుత్వంలో ఉన్న పార్టీకి... కచ్చితంగా అనుకూలంగా ఉండాల్సిందే. అందుకే ఆ వైపుగా జూనియర్ ఎన్టీఆర్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.