జగన్ ఆశలన్నీ సాయిదత్ పైనే.. ఎవరి సాయిదత్.. ఏంటా స్టోరీ..?
ఈ నియామకంపై వైసీపీలో ఎవరు ? ఈయన అంటూ ఒకేసారి పెద్ద ఇతని చర్చ మొదలైంది. వైసిపి అధికారం కోల్పోయాక కీలక నేతలు ద్వితీయ శ్రేణి నాయకులు వరుసగా వైసిపిని వీడి వెళ్లిపోతున్నారు. పార్టీని వీడవద్దు ... మళ్లీ మనం అధికారంలోకి వస్తాం అంటూ బుజ్జగిస్తున్న ఫలితం ఉండటం లేదు. ఈ క్రమంలోనే కొందరు కీలక నేతలు కూడా త్వరలోనే వైసిపిని వీడి బయటకు వెళ్లిపోతారంటూ ? ప్రచారం జరుగుతోంది. గడిచిన కొద్ది రోజులుగా వైసిపి కోసం రాజకీయ వ్యూహా కర్తను నియమించుకోవాలని ఆలోచనతో జగన్ ఉన్నారని ప్రచారం జరిగింది. కర్ణాటక - తెలంగాణలో కాంగ్రెస్‌కు వ్యూహాకర్త వ్యవహరించిన సునీల్ కనుగోలు టీమ్ కు చెందిన వ్యక్తులతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని వాదనలు వినిపించాయి.
వీటిపై చర్చ జరుగుతుండగానే పార్టీ నిర్మాణం కోసం వాళ్ళ మోహన్ సాయి దత్‌ను జగన్ నియమించారు. ఈ సాయి దత్ ఎవరో కాదు.. మొన్న లోక్సభ ఎన్నికలలో తెలంగాణలో బిజెపికి సేవలందించారు. రాష్ట్రంలో అధికార పార్టీతో సమానంగా ఎనిమిది సీట్లు బిజెపికి దక్కిన ఆయన పేరు పెద్దగా వెలుగులోకి రాలేదు. ఇప్పుడు అలాంటి వ్యక్తినే జగన్ తన పార్టీ కోసం నియమించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దేశంలో పేరు మోసిన వ్యూహకర్తలందరూ నో చెప్పడంతోనే చివరకు సాయి దత్‌ను పార్టీ నిర్మాణం కోసం జగన్ తెచ్చి పెట్టుకున్నారు అన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.