ఉత్తమ్, కోమటిరెడ్డికి సైలెంట్‌గా చెక్ పెట్టేసిన రేవంత్... వాటే గేమ్ ..?
అయితే ఉత్తమ్ కుమార్ నేతృత్వంలోని పలువురు సీనియర్ నేతలు మాత్రం అదే బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ పేరు ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే మధు గౌడ్ గత మూడు ఎన్నికలలోను వరుసగా పోటీ చేస్తూ ఓడిపోతూ వస్తున్నారు. 2014 - 2019 ఎన్నికలలో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మధుయాష్కి గౌడ్ గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గ్రేటర్ హైదరాబాద్ లోని ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గతంలో రెండు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవంతో పాటు ఇటు బీసీల్లో బలమైన గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత కావటం ... అటు ప్రత్యేక తెలంగాణ కోసం పార్లమెంట్లో చాలాసార్లు బలంగా గళమెత్తిన నాయకుడు కావడంతో మధు గౌడ్ అంటే తెలంగాణ వర్గాలలో మంచి పేరు ఉంది.
అయితే సీనియర్ నటి మధు యాష్కీకి పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీలో మరో పవర్ సెంటర్ అవుతారని మహేష్ కుమార్ గౌడ్ పేరును రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టిన మొదట్లో సీనియర్ వర్సెస్ రేవంత్ వర్గం నేతల మధ్య తీవ్రస్థాయిలను మాటల యుద్ధం కొనసాగింది. అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ పార్టీని సమన్వయం చేయటం ఆయనకు కలిసి వచ్చింది. అందుకే ఇప్పుడు రేవంత్ మహేష్ కుమార్ గౌడ్ పేరును ప్రతిపాదించి ఉత్తమ్ - కోమటిరెడ్డి కి చెక్ పెట్టేశారు.