జగన్ కౌంటర్‌పై విమర్శల వర్షం... ఇది సాయంకాలం అని తెలియదా..!
తాజాగా ఆయన రాష్ట్రంలో వరదలు.. వర్షాల నేపథ్యంలో సర్కారు చేస్తున్న సాయాన్ని విమర్శిస్తూ.. సుదీ ర్ఘ పోస్టు చేశారు. 8 అంశాలపై జగన్.. చంద్రబాబు సర్కారును నిలదీశారు. అయితే.. దీనిపై ఎదురు జగన్ పైనే నెటిజన్లు విమర్శల బాణాలు ఎక్కు పెట్టారు. జనం గుండెల్లో గుడి కట్టుకున్న జగన్.. ఇప్పుడు విమ ర్శలు చేయడం తగునా? అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. స్వయంగా జగనే రంగంలోకి ఎందుకు దిగకూడదన్న ప్రశ్నలు వస్తున్నాయి.
అయితే.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షం ఎందుకు రంగంలోకి దిగాలన్న వితం డ వాదన కూడా ఉంది. అయితే.. సాయం చేసే సమయమే తప్ప.. ఇప్పుడు విమర్శలు చేసే సమయం కాదని మాత్రం సర్వత్రా వినిపిస్తున్న మాట. అందుకే.. జగన్ చేసిన సుదీర్ఘ పోస్టుకు ప్రశంసల కన్నా విమ ర్శలే వస్తున్నాయి. ఇలాంటి కష్ట సమయంలో తాను తెచ్చిన వ్యవస్థలను తనే ముందుండి నడిపించి.. ప్రజల మధ్యకు వచ్చి ఉంటే.. జగన్ వ్యూహం మరోలా ఉండేది.
కానీ, తాడేపల్లిలోనే ఉండి.. కేవలం వారం వ్యవధిలో రెండు సార్లు మాత్రమే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం.. సర్కారుపై విమర్శలు చేయడంతో సరిపుచ్చారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ విమర్శల పాలయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా.. జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రజలకు సాయం చేసే విషయంపై దృష్టి పెడితే.. ఇటు బాధితులకు మేలు.. అటు.. జగన్‌కు ప్రశంసలు రెండు దక్కుతాయని అంటున్నారు పరిశీలకులు.