హైదరాబాద్ మహానగరంలో హైడ్రా మొన్నటి నుంచి బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. పొద్దున లేస్తే చాలు హైడ్రా... కూల్చివేతలే టీవీ ఛానల్ లో కనిపిస్తున్నాయి. పేద దానికి ఆనే తేడాలు లేకుండా... ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చి మరి అక్రమంగా నిర్మించిన ఇండ్లను అలాగే ఫామ్ హౌస్ లను... ధ్వంసం చేస్తోంది హైడ్రా. 1974 జియోగ్రాఫికల్... మ్యాప్ ఆధారంగా చెరువులను మళ్లీ పునరుద్ధరించేందుకు హైడ్రాను తీసుకువచ్చారు.
అయితే 1974 ప్రకారం చూసుకున్నట్లయితే.. చాలావరకు కట్టడాలు... చెరువులోనే జరిగాయి. దీంతో రేవంత్ రెడ్డి అన్నయ్య తిరుపతి రెడ్డి అలాగే నాగార్జున లాంటి వారు తప్పిదాలు చేసి ఎఫ్డిఎల్ పరిధిలో స్థలాలు అలాగే ఇండ్లు కొనుగోలు చేసి ఇప్పుడు అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అక్కినేని నాగార్జున N కన్వెన్షన్..ను ధ్వంసం చేశారు అధికారులు. రేవంత్ అన్న తిరుపతిరెడ్డి, మురళీమోహన్ లాంటి వారికి కూడా నోటీసులు ఇచ్చారు.
అదే సమయంలో పేదవారికి సంబంధించిన ఇండ్లను కూడా ధ్వంసం చేస్తుంది హైడ్రా. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కంటే... హైడ్రా కమిషనర్ రంగనాథ్ బాగా హైలైట్ అవుతున్నారు. ఈ తరుణంలోనే తెరపైకి కొత్త విషయం వచ్చింది. అతి త్వరలోనే రంగనాథ్.. ఆ పోస్టు నుంచి బదిలీ కాబోతున్నారట. ఆయన స్థానంలో ఓ డమ్మీ అధికారిని హైడ్రా కమిషనర్ చేయబోతున్నారట. అయితే హైడ్రా కూల్చివేతల వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి... వ్యతిరేకత వస్తుందని కాంగ్రెస్ పార్టీ గ్రహించిందని సమాచారం.
అందుకే హైడ్రా పవర్సు తగ్గించేందుకు కమిషనర్ను మార్చుతున్నారట. ఇందులో భాగంగానే హైడ్రా తాజాగా కీలక ప్రకటన కూడా చేసింది. ఎఫ్డిఎల్ పరిధిలో ఉన్న నివాస గృహాలను అస్సలు కూల్చబోమని తెలిపింది. ఎఫ్ టి ఎల్ పరిధిలో ఇప్పుడు కడుతున్న కట్టడాలను మాత్రమే ధ్వంసం చేస్తామని ప్రకటన చేశారు రంగనాథ్. ఇక ఈ ప్రకటనతో త్వరలోనే రంగనాదు పై వేటు పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.