మున్నేరు, పాలేరు, ఆకేరు వరదల ఉగ్రరూపం.. ఎంతమంది మృతి చెందారంటే..?
* మున్నేరు పాలేరు ఆకేరు వాగులలో రికార్డు స్థాయిలో నీటిమట్టం
* వీటితో కకలావికలమైపోయిన ప్రజలు
( తెలంగాణ - ఇండియా హెరాల్డ్)
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 2024లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరు, ఆకేరు, పాలేరు వాగులు వరద నీటితో సముద్రాన్ని తలపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆకేరు వాగు దాటుతుండగా తండ్రీ కూతుర్లు ఇద్దరు కూడా వాగులో కొట్టుకుపోయారు. ఆ కూతురు పేరు అశ్విని. ఆమె ఒక యువ సైంటిస్టు. ఢిల్లీలో ఆఫీస్ వర్క్‌కి అటెండ్ కావాలనే ఆత్రుతతో ఆమె హైదరాబాద్ బయలుదేరింది. అయితే వాగు దాటుతుండగా ఉధృతి పెరిగి వారి కారు నీటిలో పడిపోయింది. కొద్దిసేపటికే వారు చనిపోయారు. అశ్విని మృతదేహం వెంటనే లభ్యమయ్యింది. తర్వాత తండ్రి శవం దొరికింది. ఇదే జిల్లాలో పాకాల వాగులో ఒక గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చింది.
ఇక బొక్కల గడ్డ, ప్రకాష్ నగర్ ప్రాంతాల తలాపునే ప్రవహించే మున్నేరు చాలామంది చేత కన్నీరు పెట్టించింది. ఖమ్మంవాసులు చరిత్రలో చూడనంతగా మున్నేరుకు 36 అడుగుల మేర వరద వచ్చింది. ఈ వరదల ఫలితంగా బొక్కల గడ్డతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో సోఫాలు, పరుపులు, బీరువాలు, ఫ్రిజ్‌లు, టీవీలు, బైక్, స్కూటర్లు, కార్లు పనికి రాకుండా పోయాయి. దీనివల్ల లక్షల్లో నష్టం వచ్చింది. అంతేకాకుండా మూగ జంతువులు కూడా ఎన్నో చచ్చిపోయాయి.
ఇక పాలేరులో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుందని చెప్పుకోవచ్చు. కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామానికి చెందిన పాలేరు జలాశయం దగ్గర యాకూబ్, సైదాబీ దంపతులు సిమెంటు ఇటుకల తయారీ వ్యాపారం చేస్తున్నారు. అక్కడే వారిని అంటున్నారు అయితే ఒక్కసారిగా నీళ్లు చుట్టుముట్టడంతో వారు తమ ఇంటి పైకి ఎక్కారు అయితే వరద అనేది చాలా ఉధృతంగా వచ్చి వారి ఇంటిని గొప్ప కూల్చింది ఆ సమయంలో వారి కొడుకు కూడా ఆ ఇంటి పైన ఉన్నాడు. కుమారుడిని స్థానికులు కాపాడగలిగారు. అయితే అతని తల్లిదండ్రులు మాత్రం నీటిలో కొట్టుకుపోయి చనిపోయారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు వారు బీటెక్ చేస్తున్నారు వారి స్టోరీ కూడా అందరిని కలిచివేసింది.
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా శనివారం వరకు 31 మంది మృతి చెందినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అనధికారిక గణాంకాల ప్రకారం మృతుల సంఖ్య 40కి పైగానే ఉంది.