తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే ఎన్నో సార్లు అనేక ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎక్కువ శాతం తెలుగు రాష్ట్రాలలో వర్షాలు ఎక్కువ కురిసిన సమయాల్లో వరదలు రావడం , వాటి ద్వారా ప్రజలు అనేక ఇబ్బందులు పడడం అనేక మంది వరదల్లో కొట్టుకుపోవడం వాటి ద్వారా ప్రాణ నష్టం ఎంతో ఆస్తి నష్టం జరుగుతూ వస్తుంది. ఇక ఎప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రకృతి వైపరీతం జరిగినా కూడా సినీ పరిశ్రమ వైపు చాలా మంది దృష్టి పడుతూ ఉంటుంది. ఎందుకు అంటే సినిమాల్లో నటించే నటి నటులు ఎక్కువ మొత్తంలో రెమ్యూనిరేషన్ ను తీసుకుంటారు అనే వార్తలు వస్తూ ఉంటాయి.
దానితో వారు ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఎలా స్పందిస్తున్నారు ..? ప్రజలకు ఎంత మొత్తంలో విరాళాలను ప్రకటిస్తున్నారు అని జనాలు అంతా ఎంతో ఆత్రుతగా చూస్తూ ఉంటారు. ఇక దాదాపుగా ప్రకృతి వైపరీత్యాలు జరిగిన ప్రతి సారి కూడా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన హీరోలు పెద్ద మొత్తంలోనే విరాళాలను అందిస్తున్నారు. ఎవరో కొంత మంది విరాళాలు ఇవ్వడానికి దూరంగా ఉంటున్న కొంత మంది భారీ మొత్తంలో ఇస్తున్న మరి కొంత మంది తక్కువ మొత్తంలో ఏదో ఒక రకంగా హీరోలు మాత్రం పెద్ద స్థాయిలోనే విరాళాలను ఇస్తూ ప్రజలకు అండగా నిలబడుతున్నారు.
ఇకపోతే హీరోయిన్లు మాత్రం ఎక్కడి నుండో రావడం , కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోవడం వెళ్లిపోవడం మాత్రమే కానీ విరాళాలు ఇచ్చిన దాఖలాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. ఇక ఇక్కడి వరకే ఆగిపోతున్నాం. సినిమా ఇండస్ట్రీలో హీరోలు , హీరోయిన్ల తర్వాత టెక్నీషియన్స్ కూడా పెద్ద మొత్తంలోనే రెమ్యూనిరేషన్లను తీసుకుంటూ ఉంటారు. ఇక సినిమాలు మంచి విజయాలు సాధిస్తే నిర్మాతలు కూడా పెద్ద మొత్తంలోనే డబ్బులను వెనకేసుకొస్తూ ఉంటారు.
కొంత మంది టెక్నీషియన్స్ , నిర్మాతలు విరాళాలను ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. వాటికి కొంత మంది నిర్మాతలు , టెక్నీషియన్స్ విరాళాలను ప్రకటించారు. కానీ ఎక్కువ శాతం మంది మాత్రం విరాళాలను ప్రకటించడంలో వెనుకబడిపోయి ఉన్నారు. వారు కూడా ముందుకు వచ్చి విరాళాలను ప్రకటిస్తే బాగుంటుంది అని అనేక మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.