ఈటల రాజేందర్: తెలంగాణ వీరుడు.. కేసీఆర్ ను తలదన్నే నాయకుడు ?
* తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఈటలకు గుర్తింపు
* విద్యార్థి దశలోనే టీఆర్ఎస్ లో చేరిన ఈటల
* భూకబ్జాల ఆరోపణలతో టిఆర్ఎస్ నుంచి సస్పెండ్
* టిఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరిన ఈటెల
* హుజరాబాద్ ఉప ఎన్నికలు, మల్కాజ్గిరి ఎంపీగా గ్రాండ్ విక్టరీ
ఈటల రాజేందర్... ప్రస్తుతం మల్కాజ్గిరి బిజెపి ఎంపీగా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత అంతే క్రేజ్ ఉన్న లీడర్ ఈటల రాజేందర్. ఆయన ఏ పార్టీలో ఉన్న విజయం మాత్రం... ఈటల రాజేందర్ దే అవుతుంది. అయితే కెసిఆర్ చేతిలో మోసపోయిన నాయకుడిగా... ఈటల రాజేందర్ ను అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. దాదాపు 20 సంవత్సరాలుగా కేసీఆర్ తో ప్రయాణం చేశారు ఈటెల రాజేందర్.
అయితే ఆ వెంటనే హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపి పార్టీలో చేరారు ఈటల రాజేందర్. ఇక 2021 సంవత్సరంలో హుజరాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా విజయం సాధించి... వీరుడిగా ఎదిగారు ఈటల రాజేందర్. కెసిఆర్ ఎన్ని.. స్కెచ్ లు వేసిన.. హుజరాబాద్ అడ్డాలో ఈటల జెండానే ఎగిరింది. అయితే అలాంటి ఈటల రాజేందర్.. ఆ తర్వాత బిజెపి పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
ఇక మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈటల రాజేందర్... హుజరాబాద్ నియోజకవర్గం లో ఓడిపోవడం జరిగింది. అటు కెసిఆర్ చేతిలో కూడా ఈటల రాజేందర్ ఓడిపోయారు. దీంతో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి టికెట్ ఇచ్చింది బిజెపి. ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఇటలీ రాజేంద్ర విజయం సాధించడం జరిగింది.