కడప రాజకీయాల్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎంతో స్పెషల్.. ఏ పార్టీలో ఉన్నా తిరుగులేదుగా!
తొలి టర్మ్ లో 10 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించిన గడికోట 2014 ఉపఎన్నికల్లో మాత్రం 50000కు పైగా మెజారిటీతో గెలిచారు. 2014 సంవత్సరంలో 30000కు పైగా మెజారిటీతో గెలిచిన ఈ నేత 2019లో సైతం 30000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. కడపలో ఇంటర్ వరకు చదువుకున్న ఈ నేత ఆ తర్వాత బెంగళూరులో చదువుకొని 11 సంవత్సరాలు ఐటీ రంగానికి అంకితం అయ్యారు.
వైఎస్సార్ నాయకత్వంలో కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడిగా ఈయన పని చేశారు. వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులలో ఒకరిగా గడికోటకు పేరుంది. ఏ పార్టీలో ఉన్నా తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకున్న ఈ నేత కడప రాజకీయాల్లో ఎంతో స్పెషల్ అని అనిపించుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఊపిరి ఉన్నత వరకు ప్రజా సేవే లక్ష్యంగా, నియోజక వర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తానని ఆయన చెప్పారు.
ఎన్నికల్లో ఓటమిపాలైనా ప్రజలకు దగ్గరగానే ఉంటానని నాకు తెలిసింది ప్రజాసేవ మాత్రమేనని ఆఖరి శ్వాస వరకు ప్రజాసేవ చేస్తానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఓటమిపాలైనా తాను కృంగిపోనని ప్రజల కోసం రాత్రింబవళ్లు పని చేసే ఆరోగ్యాన్ని, అన్ని కష్టాలను భరించే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడని ఆయన తెలిపారు. ప్రజా సేవే లక్ష్యంగా, నియోజక వర్గ అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతానని శ్రీకాంత్ రెడ్డి కామెంట్లు చేశారు.