ఈసారి అయినా కేటీఆర్ సర్వే నిజం అవుతుందా?

frame ఈసారి అయినా కేటీఆర్ సర్వే నిజం అవుతుందా?

Chakravarthi Kalyan

కేసీఆర్, కేటీఆర్ లు అధికారంలో లేనప్పుడు చెప్పిన రాజకీయ జోస్యాలన్నీ తప్పాయి. 2014 ఎన్నికల్లో ఏపీలో జగన్ గెలుస్తారని అని కేసీఆర్ ప్రకటించారు. కానీ చంద్రబాబు విజయకేతనం ఎగురవేశారు. మొన్నటి ఎన్నికల్లో తాను ఓడిపోయి, ఎంపీ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ.. ఏపీలో రెండోసారి జగన్ గెలుస్తారు అంటూ కేసీఆర్, కేటీఆర్ లు ప్రకటించారు. అది కూడా తప్పింది.


గతంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే అంటే రాజకీయ వర్గాల్లో కచ్చితత్వం ఉండేది. కానీ కొన్ని రోజుల తర్వాత అది కూడా బోల్తా కొట్టింది. దీంతో ఆయన ఎగ్జిట్ పోల్స్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ కేసీఆర్ కేటీఆర్ లు మాత్రం అలా కామ్ గా ఉండకుండా తమ జ్యోతిష్యాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు.


తాజాగా అమెరికాలో ఎవరు గెలవబోతున్నారో మాజీ మంత్రి కేటీఆర్ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. కొంత కాలంగా వ్యక్తిగత పర్యటన కోసం అమెరికాలో ఉన్నారు. తండ్రి బాధ్యతలు పిలుస్తున్నాయ్ అంటూ కేటీఆర్ అమెరికా వెళ్లారు. అక్కడి నుంచే తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. తెలంగాణలో జరగుతున్న రాజకీయాలు, వరదలపై ట్విటర్ వేదికగానే సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.


ఇక అమెరికా ఫలితాల విషయానికొస్తే ఈ సారి అమెరికా అధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలవబోతున్నారు… అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు వచ్చేలా ఉన్నారు అంటూ పోస్ట్ చేశారు. భారతీయ మూలాలు ఉన్న కమలా హారిస్ అంటే ఎక్కువ మంది ఆసక్తిగానే ఉన్నారు. అదే సమయంలో రిపబ్లికన్ అయితేనే బెస్ట్.. ట్రంప్ వస్తే ఇండియన్స్ కొంత సేఫ్ అనే వారు లేకపోలేదు. ఇలాంటి సమయంలో కేటీఆర్ జోస్యం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.  ఈ సారైనా ట్రాక్ రికార్డు మార్చి చెప్పినట్లే హారిస్ గెలుస్తారా లేదా.  ఇప్పుడు అయినా కేటీఆర్ జోస్యం ఫలిస్తుందా లేక బోల్తా కొడుతుందా? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: