పురంధేశ్వరికి చెక్. ! ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ సీఎం?

Chakravarthi Kalyan

ఏపీ బీజేపీ కొత్త చీఫ్ ఎవరు అనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆ పదవిలో ప్రస్తుతం ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి పదవీ కాలం తొందర్లోనే ముగియనుంది. ఆమె 2022లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా అనూహ్యంగా బాధ్యతలు స్వీకరించారు. బీజేపీలో అధ్యక్ష పదవీ కాలం రెండేళ్లు మాత్రమే.


పైగా ఇప్పుడు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు ప్రక్రియ సాగుతోంది. దీని తర్వాత కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని పలువురు సీనియర్ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీ బీజేపీ చీఫ్ గా ఎవర్నీ నియమిస్తే బాగుంటుంది అని హైకమాండ్ ఆలోచన చేస్తోందంట. ఉమ్మడి ఏపీ రెండు విభజించిన తర్వాత సుదీర్ఘ కాలం కంభంపాటి హరిబాబు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఉన్నారు. ఆయన అనంతరం సోము వీర్రాజుకు పగ్గాలు ఇచ్చారు.


ఆయన నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి అవకాశం దక్కించుకుంది. ఇలా చూసుకుంటే మొత్తం నలుగురు ఏపీ బీజేపీ అధ్యక్షులుగా పనిచేస్తే ముగ్గురు కోస్తాకు చెందిన వారే ఉండటం విశేషం. పైగా ఇద్దరు కమ్మ, ఇద్దరు కాపులకు బీజేపీ అవకాశం ఇచ్చినట్లయింది. అలా సామాజిక ప్రాంతీయ సమతూకం పాటించిన బీజేపీ విభజన ఏపీలో తొలిసారిగా ఒక బలమైన సామాజిక వర్గం వైసీపీకి గట్టి పట్టుందని భావిస్తున్న రాయలసీమ నుంచి ఒక కీలక నేతకు అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలని చూస్తోందని అంటున్నారు.


ఉమ్మడి ఏపీ మాజీ సీఎం kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరగానే పార్టీ ఆయనకు అనేక అవకాశాలు ఇచ్చింది. ఆయనకు పార్టీ జాతీయ నేతగా భావిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజంపేట నుంచి kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మరో అవకాశంగా అధ్యక్ష బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఆయన కాంగ్రెస్ లో అనేక పదవులు చేపట్టడం.. ఉద్యమ సమయంలో ప్రభుత్వాన్ని సమర్థంగా నడపడంతో పాటు లీడర్ షిప్ లక్షణాలు ఆయనకు ప్లస్ గా మారాయి. దీంతో పాటు ఓసీ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు ఈయన్ని అధ్యక్షుడిగా నియమించనుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: