ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేసిన అప్పులు ఆదాయ వ్యయాలపై శ్వేతా పత్రాన్ని రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రాన్ని విపరీతమైన అప్పులపాలు చేశారని ఆరోపణలు కూడా చేశారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉందని ప్రతి సందర్భంలో చెబుతూ వచ్చారు. మరి ఆ ప్రభుత్వము ఉన్నప్పుడు అప్పులు బాగా చేసిందని ఎద్దేవా చేసిన చంద్రబాబు ఈ ప్రభుత్వం ఏర్పడి కనీసం మూడు నెలలు కూడా పూర్తికాకముందే తడిసి మోపెడయ్యే అప్పులు చేశారు. ఇంతకీ వీరు చేసిన అప్పులు ఎంతయ్య అంటే 43 వేల కోట్లు. నిజానికి కూటమి ప్రభుత్వం జూలై 12వ తేదీన కొలువు దీరింది. ఇదే తరుణంలో ఆదాయ ద్రవ్యలోటు కూడా భారీ గానే రికార్డ్ అయినట్టు తెలుస్తోంది.
ఈ మేరకు ప్రధాన గణాంకాలు అధికారి కార్యాలయం నుంచి తాజాగా ఒక నివేదిక బయటకు వచ్చింది. అప్పులు ఆదాయ మార్గాల ద్వారా ఏప్రిల్ నుంచి జూలై వరకు 44822 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరాయట. ఇందులో పన్నులు, ఆదాయం జిఎస్టి కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు అన్నీ కలిపి 41 వేల కోట్ల వరకు వచ్చాయట. ఇవే కాకుండా ప్రభుత్వం ప్రకటించిన పథకాలకు అదనంగా 43 వేల 58 కోట్ల రుణాలు తేవలసి వచ్చిందట. మొత్తం 50వేల వేతనంతో యువతకు చంద్రబాబు భారీ కానుకగా అందించారు.
దీంతో పథకాల అమలు చేయడానికి ప్రతినెల 11 వేల కోట్ల రూపాయల అప్పులు చేయవలసి వస్తుందట. ఇప్పటివరకు రాష్ట్రంలో 87,282 కోట్లు ఖర్చులైనట్టు , ఆదాయానికి మరియు వ్యయానికి మధ్య అంతరాన్ని ఈ రుణాలతోనే భర్తీ చేయాల్సి వచ్చిందని నివేదికలో తెలియజేశారు. మొత్తం అయిన ఖర్చు 87,282 కోట్లు.ఇందులో 85,056 కోట్ల రూపాయలను ఖర్చు చేసి 226 కోట్లను మాత్రమే పెట్టుబడి రంగానికి వెచ్చించారట. ఈ విధంగా ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే ఇన్ని అప్పులు చేయడంతో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.