ఏపీ సిఎం: వరద బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన చంద్రబాబు..!
ఇలా జరగడానికి ముఖ్య కారణం గత ప్రభుత్వం నిర్లక్ష్యమేనని డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏలేరు కాలువ ఆధునికరణ బాధ్యత చేయలేదని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చేసే బాధ్యతలు తీసుకుంటుందంటూ తెలిపారు. 65 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని కూడా సీఎం చంద్రబాబు వెల్లడించారు.. దీంతో కచ్చితంగా ప్రతి కుటుంబానికి కూడా 10,000 ఆర్థిక సహాయంతో పాటు బట్టలు ఇస్తామంటూ తెలిపారు.. వీటితో పాటు పంట నష్టం జరిగిన ప్రాంతాలలో హెక్టారుకు 25వేల రూపాయలు ఇవ్వబోతున్నట్లు తెలియజేశారు. ఈనెల 17వ తేదీన బాధితులకు పరిహారం అందిస్తామంటూ తెలియజేశారు సీఎం చంద్రబాబు.
నష్టపోయిన వారందరికీ కూడా ప్రభుత్వం కొత్త ఇల్లు కట్టిస్తుందని.. ఎవరు కూడా ఆ ధైర్యం పడొద్దు అంటూ తెలియజేశారు.. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు వైసీపీ పార్టీకి కేవలం రెండు సీట్లనే ఇచ్చారని ప్రకాశం బ్యారేజ్ కూల్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని రెండున్నర లక్షల కుటుంబాలు అన్యాయం అయిపోయేవారు.. ప్రభుత్వం వెంటనే వీటిని గుర్తించింది అంటూ తెలిపారు సీఎం చంద్రబాబు.. ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్న చెప్పాలని ప్రజలను సూచించారు సీఎం చంద్రబాబు. త్వరలోనే అందుబాటులోకి ఒక యాప్ తీసుకువస్తామని ఎవరైనా సరే ఆ యాప్ ద్వారా ఇబ్బందులు ఉంటే చెప్పొచ్చు అంటూ వెల్లడించారు. మరి ఏ మేరకు ఇస్తారో చూడాలి.