జనసేన విషయంలో చంద్రబాబు ఘోర తప్పిదాలు.. గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి ఇదే!
అయితే చంద్రబాబు సీఎం అయిన తర్వాత జనసేన విషయంలో చంద్రబాబు ఘోర తప్పిదాలు చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే గెలిచిన ప్రాంతాలలో టీడీపీ నేతలకు సరైన గౌరవం దక్కడం లేదని అదే విధంగా టీడీపీ గెలిచిన ప్రాంతాలలో జనసేన నేతలకు ఇదే పరిస్థితి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బ్యానర్ చించిన ఘటనలో జనసేన నేతతో టీడీపీ నాయకుడు కాళ్లు పట్టించుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు అయ్యాయని సమాచారం అందుతోంది. జనసేన నేతలకు సంబంధించి ఇలాంటి అవమానాలు జరగడం అంటే ఈ తప్పిదం చంద్రబాబు ఘోర తప్పిదం అనే భావించాలి. గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులను అర్థం చేసుకుని చంద్రబాబు ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. చంద్రబాబు పవన్ ఎలా కలిసి ఉన్నారో టీడీపీ జనసేన నేతలు సైతం అదే విధంగా కలిసి ఉంటే పరిస్థితులు బాగుంటాయి.
జనసేన నేతలను అవమానించేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తే భవిష్యత్తులో రెండు పార్టీల మధ్య గ్యాప్ ఏర్పడి విడిగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 2029లో కూటమి అధికారంలోకి రావాలంటే టీడీపీ, జనసేన విమర్శలకు తావివ్వకుండా పాలన సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టీడీపీ, జనసేన నేతల భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. చంద్రబాబు పొలిటికల్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.