మెరుపులు- మరకలు: పెన్షన్ పెంచి పేదలకందించి.. చంద్రన్నా నీకెదురేదన్నా..!!
-తర్వాత ప్రతి నెలా 4000..
- మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం
నారా చంద్రబాబు నాయుడు.. ఈయన పేరు చెబితే దేశవ్యాప్తంగా తెలియని వారు ఉండరు. కేవలం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా కీలకమైన నాయకుడిగా ఎదిగారు. అలాంటి చంద్రబాబు నాయుడు రాజకీయాలను అర్థం చేసుకోవడం ఎవరివల్లా కాదు. ఏదైనా వ్యూహం రచించారంటే అది నెరవేరేవరకు అలు పెరగని శ్రమ చేస్తాడు. అలా రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే చంద్రబాబు పేరు చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికల్లో ఏపీలో సంచలమైన విజయాన్ని సాధించి అదరహో అనిపించాడు. కనీసం ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడంటే చంద్రబాబు వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి చంద్రబాబు నాయుడు కేవలం ఏపీలో అధికారంలోకి రావడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కీలకంగా మారాడు. ఈయన చెప్పిందే కేంద్రంలో వేదంలా మారింది. అలాంటి సీనియర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ల పెంపు చేసి ప్రతినెల ఒకటో తేదీ వరకు పేద ప్రజలకు పింఛన్లు వేసి పేదల దేవుడయ్యారు. మరి పింఛన్ ఎంత పెంచాడు..ఆ వివరాలు ఏంటో చూద్దాం.
7000 నుంచి 4000:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే మొదటి నెల జూలై 1వ తేదీన 7వేల పెన్షన్ ప్రజల ఖాతాలో జమ చేశారు. అంతేకాకుండా కొత్త పాస్ పుస్తకాలను కూడా మంజూరు చేశాడు. అయితే ఎన్నికలకు ముందు టిడిపి కూటమి ఇచ్చిన మాట ప్రకారం వృద్ధాప్య పెన్షన్ 3000 నుంచి 4 వేల వరకు అందిస్తామని చెప్పి ప్రతి నెల 4000 వారి ఖాతాలో జమ చేస్తున్నారు. అంతే కాకుండా ఏప్రిల్ నెల నుంచి పెంచిన పింఛన్ అమల్లోకి తీసుకొచ్చి ఆ డబ్బులను జూలై 1వ తేదీన ప్రతి ఒక్కరికి ₹7,000 వృద్ధాప్య పెంచిన అందించి ఆ తర్వాతి నెల నుంచి 4000 వేల రూపాయలను అందిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా దివ్యాంగులకు 6000 కూడా అమలు చేశాడు. రాష్ట్రవ్యాప్తంగా 65.30 లక్షల మంది పింఛన్ దారులు ఉన్నారు. దీనికోసం ప్రతి నెల ప్రభుత్వం 1939 కోట్లు చెల్లింపులు చేస్తోంది.