తెలంగాణ కేబినెట్లో కొత్త మంత్రులు.. రేవంత్‌కు వాళ్లతోనే పెద్ద తలనొప్పి..?
కానీ ఒకే కుటుంబానికి రెండు పదవులు ఎలా ఇస్తారని కొందరు పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఉత్తమ్ పద్మావతికి అసెంబ్లీ అంచనాల సంఘం చైర్మన్ పదవి ఇచ్చినట్టు చర్చ జరుగుతుంది. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎస్టీ కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే కేతావత్ బాలు నాయక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. కానీ ఒకే జిల్లాకు ఏకంగా నాలుగు మంత్రి పదవులు ఇవ్వటం సాధ్యం కాదనే ఉద్దేశంతో ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని టా ఉంది.
ఇది ఇలా ఉంటే మంత్రి పదవి దక్కించుకునేందుకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కొంతకాలంగా ఢిల్లీలోనే ఉంటూ లాబీయింగ్ చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కోసం తీవ్రంగా కష్టపడ్డానని ఆయన ఏఐసీసీ లీడర్లకు వివరిస్తున్నట్లు సమాచారం. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం సోదరులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ - బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సైతం పోటీపడుతున్నారు.
లోక్‌సభ ఎన్నికలలో పెద్దపల్లి నుంచి వివేక్ కుమారుడు వంశీ ఎంపిగా గెలిచారు. దీంతో ఓకే ఫ్యామిలీకి మూడు పదవులు ఉన్నాయని మళ్లీ అదే కుటుంబానికి మంత్రి పదవి ఇవ్వవద్దని కొందరు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారబోతుంది.. అన్నది వాస్తవం. అసంతృప్తులను చల్లార్చడం రేవంత్ రెడ్డికి అంత ఈజీ కాదు.
: