ఏపీ: ఆ టిడిపి కేంద్రమంత్రికి అరుదైన గౌరవం..!
అలా ఈ రెండు దేశాలతో పాటు మిగతా దేశాలు కూడ రామ్మోహన్ నాయుడు పేరుని తెలపడంతో ఏకగ్రీవంగా గెలిచారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌర విమాన రంగాన్ని సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తాను అంటూ హామీ ఇచ్చారు.. అలాగే ఆసియా, పసిఫిక్ సభ్య దేశాల మధ్య ఈ రాకపోకలను సులభంగా చేసేందుకు కృషి చేస్తానంటూ తెలియజేశారు. దేశం తరఫున దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరించి నిర్వహిస్తానని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
అలాగే ఆసియా ,పసిఫిక్ వంటి పౌర విమాన అభివృద్ధి విషయం పైన రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వాణిజ్య విమానం పదేళ్ల క్రితమే మొదలయ్యిందని తెలిపారు.. ఆసియా పసిఫిక్ ప్రాంతం 2035 నాటికి అది పెద్ద విమాన మార్కెట్ గా నిలుస్తుందని తెలియజేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోనే ఇండియాలోనే ఏవియేషన్ చాల శరవేగంగా ముందుకు వెళ్తోంది.. 2040 నాటికి దేశంలోనే విమానాశ్రయాలు ఉండే సంఖ్య పెరుగుతుందని కచ్చితంగా తెలియజేశారు. సుమారుగా 350 విమానాశ్రయాలు పెంచాలని ఆలోచన తో ఉన్నట్లుగా తెలియజేశారు. 2014లో 74 ఉండే ఎయిర్ పోస్టులు 157 కి పెంచామంటూ తెలియజేశారు.. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని చోట్ల ఎయిర్ పోర్టులను విస్తరించేలా ప్లాన్ చేస్తున్నామంటూ రామ్మోహన్ నాయుడు తెలియజేశారు.