రైతుల రుణం తీర్చుకున్న రేవంత్.. వైయస్సార్ ను మించిన పాలన.!!
- వైయస్ పాలనను మరిపించిన రేవంత్..
- అద్భుత నిర్ణయాలతో ముందుకు..
- రెండు లక్షల రుణమాఫీ తో రైతుల కళ్ళల్లో ఆనందం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుత పాలన అందించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది అలనాటి హీరో ఎన్టీఆర్.. ఆయన ఎన్నో పథకాలు తీసుకొచ్చి పేద ప్రజలకు దేవుడయ్యారు. ఇక ఈయన తర్వాత అంతటి స్థానాన్ని పొందింది ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పవచ్చు. ఈయన హయాంలోనే రైతులకు రుణమాఫీ తో పాటు ఉద్యోగ కల్పన, వైద్యరంగంలో అభివృద్ధి జరిగింది. కొన్నాళ్లపాటు రైతులు వైయస్ రాజశేఖర్ రెడ్డిని దేవుడితో సమానంగా కొలిచారు. అలాంటి రాజశేఖర్ రెడ్డి తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు విభజించబడ్డాయి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రెండు పర్యాయాలు కేసిఆర్ సీఎం అయ్యారు. ఈయన కూడా రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి లా పేరు తెచ్చుకోలేక పోయారు. ఇక ఈ సీఎం ల అందరిని మరిపించేలా తెలంగాణ రాష్ట్రానికి మూడవ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పాలిట దేవుడయ్యారు. మూడు విడతల్లో రెండు లక్షల రుణమాఫీ చేసి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించాడు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు చేయని విధంగా మేలు చేశాడని చెప్పవచ్చు. అలాంటి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం వేస్తున్న ప్రతి అడుగు అమోఘం. మరి ఆయన చేస్తున్నటువంటి పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రుణమాఫీ ఘనుడు:
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం 6 గ్యారంటీల్లో ఒకటైనటువంటి ఉచిత బస్సు పథకంపై సంతకం పెట్టారు. ఈ పథకానికి ప్రస్తుతం అద్భుతంగా రిజల్ట్ వస్తోంది. దీని ద్వారా ఎంతో మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తూ ఆనంద పడుతున్నారు. ఇదే కాకుండా ఉచిత కరెంట్, సబ్సిడీపై గ్యాస్, రైతు రుణమాఫీ,ఆసరా పింఛన్ల పెంపు వంటి పథకాలు ప్రవేశపెట్టాడు. ఇందులో ఆసరా పింఛన్ల పెంపు, మహిళలకు 2500 రూపాయలు తప్ప అన్ని పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయి. ఈ విధంగా చెప్పిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి చేసి చూపించారని చెప్పవచ్చు. అలాంటి రేవంత్ రెడ్డి ఏ పని చేసిన భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ముందుకు అడుగులు వేస్తున్నారు. రాష్ట్రం విపరీతమైనటువంటి అప్పుల్లో ఉన్నా కానీ, ఓవైపు అప్పులకు వడ్డీలు కడుతూ మరోవైపు రాష్ట్ర పాలనను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా సుభీక్షంగా బ్రతుకుతున్నారని చెప్పకనే చెప్పవచ్చు.