* పదిలక్షల కోట్లు దాటేసిన రాష్ట్రఅప్పులు.!
* సాధ్యం కానీ పరిస్థితుల్లో 'సూపర్ సిక్స్' హామీలు.!
* రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకువాలంటూ సీఎం ఆవేదన.!
* అప్పుల ఎఫెక్ట్ తో మంచి పధకాలకు సైతం గండి..!
(ఏపీ-ఇండియాహెరాల్డ్): గతంలో ఏప్పుడు లేని విధంగా రాష్ట్ర ఖజానా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వైయస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు సంభవించింది. 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన వైసీపీ ఎలాగైనా సరే 2019 ఎన్నికల్లో గెలవాలి అనే ఉద్దేశంతో 2019 ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో భాగంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై భారం పడుతుందేమో బేరిజు వేసుకోకుండానే భారీగా ఎన్నికల హామీ ఇచ్చారు.అయితే అనుకున్నట్లుగానే 2019 లో అధికారం చేపట్టినాక దాదాపు అధికారంలో ఉన్న అయిదేళ్లు ఆయన సంక్షేమ పధకాలు కింద లక్షల కోట్లు అప్పు చేసి మరీ ఖర్చు పెట్టారు.ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం కోసం అడ్డదిడ్డంగా హామీలిస్తుంటారు మన రాజకీయా నేతలు ఒకరు ఉచితమంటే దానికి రెట్టింపు ఉచితమని మరొకరు అంటుంటారు.అయితే జగన్ సంక్షేమం పేరుతొ లక్షల కోట్లు డిబిటీ ద్వారా ప్రజలకు నేరుగా వారి వారి అకౌంట్కు నగదు జమ చేసినప్పటికి అది రాష్ట్ర అభివృద్ధిపై తీవ్రంగా ప్రభావం చూపి అభివృద్ధి అనేది శున్యం అయింది.దాంతో అధికార పార్టీ ఐనా వైసీపీను ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీగా ఓడించి రాష్ట్ర అభివృద్ధి అనేది చంద్రబాబుతోనే సాధ్యం అనేలా కూటమిగా వచ్చిన టీడీపీను ప్రజలు మొగ్గు చూపి గెలిపించుకున్నారు.
అయితే ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో చంద్రబాబు కూడా సూపర్ సిక్స్ పధకాలు అంటూ ప్రజల్లో లోతుగా తీసుకోని పోయి ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యేలా చేశారు.అయితే దాంట్లో భాగంగానే వృద్ధాప్య పెన్షన్ ను మూడువేల నుండి నాలుగు వేలకు పెంచడం జరిగింది.దానివల్ల రాష్ట్రంపై భారం బాగా పెరిగింది.అయితే సూపర్ సిక్స్లో భాగంగా ఉచిత బస్సు, మహిళలకు పదైదు వందలు అని, తల్లికీ వందనం లాంటి పధకాలకు భారీగా బడ్జెట్ కావాలి. మరీ ఇలాంటి హామీలన్నీ అమలు అనేది ప్రస్తుతానికి గండి పడిందనే చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చెప్పకనే చెప్పారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేస్తూ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలిచ్చాం ఇప్పుడేమో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే ఆవేదనతో పాటు భయమేస్తోంది అన్నారు.ముందుకు కదల్లేక పోతున్నాం.
ఇప్పటికే రాష్ట్రంపై సుమారు రూ. 10లక్షల కోట్లు అప్పుల భారం ఉంది.ఈ విషయాలపై రాష్ట్ర ప్రజలు కూడా సీరియస్‌గా ఆలోచించాలి.లేదంటే ఈ సమస్య ఇలాగే ఉండిపోతుంది.ప్రజా జీవితంలో ఉన్న నాయకులు బాధ్యతగా ఉండాలి' అంటూ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అన్న మాటలు పలువురిని ఆశ్చర్యంలో పడేయటమే కాకుండా ఎందుకు సీఎం ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే ఆలోచనల్లో పడేలా చేశాయి.
అయితే రాష్ట్రం ఇప్పటికే పీకల్లోతుల్లో అప్పుల్లో కురుకుపోయిఉంది.ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధిపైనే ఫోకస్ చేసిన చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు అమలు చేసేది లేదని అర్ధం అవుతుంది కాకపోతే ఇలాంటి కొన్ని అవసరం లేని పధకాలకు డబ్బులు ఖర్చు చేయడం వల్ల అసలు అవసరం ఐనా పధకాలుపై కూడా ప్రభావం చూపుతున్నాయి.తన సుదీర్ఘమైన అనుభవంతో సంపద సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు హామీలపై నాలుక మడతేస్తున్నారని.. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కూడా మౌనంగా ఉండిపోయారని ప్రతిపక్షంలో ఉన్నవారు కడిగేస్తున్నారు. కానీ ఎవరు ఎమన్నా ముందు చూపుతో ఆలోచిస్తున్న చంద్రబాబు ఇలాంటి అనవసర పధకాల కోసం డబ్బులు ఖర్చు చేయడం కంటే వీటికి ఫుల్ స్టాప్ పెట్టె విధంగా ఎన్ని విమర్శలు వచ్చిన తాను సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది.