జగన్, కేసీఆర్ లను విమర్శిస్తూ.. చంద్రబాబు, రేవంత్ ఆ విషయమే మర్చిపోయారే?

praveen
ఎన్నికలు వచ్చాయి అంటే చాలు నాయకుల ప్రకటించే ఉచిత పథకాలకు అడ్డు అదుపు ఉండదు అన్న విషయం తెలిసిందే. రాష్ట్ర బడ్జెట్ ఏంటి అన్న విషయాన్ని మర్చిపోయి హామీల మీద హామీలను ప్రకటిస్తూ ఉంటారు. ప్రజలు కూడా ఇలాంటి హామీలను తెగ నమ్మేస్తూ ఇక ఏ నాయకుడు ఎక్కువ సంక్షేమ పథకాలను ప్రకటిస్తే వారికే ఓటు వేయడం చేస్తూ ఉంటారు.


 ఇంకేముంది ఇలాంటి ఉచిత పథకాలతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తూ ఉంటారు. కనీసం ఇలాంటి పథకాలు అటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ప్రభావం చూపుతాయి అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. పథకాల అమలు కోసం కేంద్రం నుంచి లక్షల కోట్ల అప్పులు తీసుకురావడం చేసి ఏకంగా తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజలపైనే పన్నుల భారం మోపడానికి కూడా రెడీ అవుతూ ఉంటారు అను విషయం తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలం నుంచి ఇదే జరుగుతుంది. {{RelevantDataTitle}}