రాయలసీమ: కూటమి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!
తిరుపతికి దగ్గరగా ఉండేటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేయాలని.. అలాగే అక్కడి ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కూడ ఏర్పాటు చేస్తే అందుకు తగిన వసతులు అన్నీ కూడా అక్కడ పుష్కలంగా ఉన్నాయని ఎంపీ దగ్గు ముల్ల ప్రసాదరావు రైల్వే శాఖ మంత్రి కి వివరించారట.. అయితే అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉందని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అనుమతులు అన్నీ కూడా త్వరలోనే అందిస్తామని తెలియజేశారట. అలా వచ్చే ఏడాది అశ్వని వైష్ణవ్ మార్చి నుంచి పాకాల స్టేషన్ ని అభివృద్ధి చేసే విధంగా పనులు చేస్తామని తెలియజేశారట.
ముఖ్యంగా స్టేషన్ ని పూర్తిగా ప్రస్తుతం ఉన్న ఆధునీకరణంగా తయారు చేస్తామని..అలాగే ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని ఈ ప్రాంతంలోని ఎనిమిది లైన్లను నిర్మించడానికి సిద్ధమవుతున్నామని హామీ కూడ ఇచ్చారట. ఈ విషయాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుంతకల్లు డివిజన్ కి సంబంధించి పూర్తి ఉత్తర్వులను పంపించారట. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే ఈ పనులు కూడా మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావడం వల్ల రాయలసీమలో ఉండే వారందరికీ కొన్ని వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. ఇండియన్ రైల్వేలోనే పాకాలకు ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతుంది. ప్రస్తుతం అయితే తిరుపతి నుంచి రేణిగుంట మధ్యలో మూడు లైన్ల నిర్మాణం జరుగుతున్నదట. తిరుపతిని కూడా అత్యాధునిక సౌకర్యాలను కల్పించే విధంగా చేస్తున్నారట.