చాకలి ఐలమ్మ స్ఫూర్తితో అభివృద్ధిలో పరుగులు పెడుతున్న గల్లా మాధవి..!!

Pandrala Sravanthi
- యంగ్ ఎమ్మెల్యేగా  గుర్తింపు.
- మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన అద్భుతమైన వాగ్దాటి.
- అభివృద్ధి సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు.!


 గల్లా మాధవి  గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో  ఎంత ఫేమస్సో మనందరికీ తెలుసు. ఆమె పెట్టిన హాస్పిటల్ ద్వారా ఎంతో మంది పేదలకు ఉచిత వైద్య సేవలు అందించి మంచి గుర్తింపు సాధించింది. అలాంటి గళ్ళ మాధవి ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వస్తానని ఆలోచించలేదట. అనుకోని సంఘటనల వల్ల తన భర్త ద్వారా  టిడిపి పార్టీ నుంచి టికెట్ అందుకుంది. అలాంటి గళ్ళ ఆర్థికంగా ఎదిగిన కుటుంబం నుంచి వచ్చిన  మహిళ. పూర్వకాలం నుంచే వీరి ఫ్యామిలీ ఆర్థికంగా ఎదిగారు. అలాంటి ఈమె గల్లా రామచంద్రరావును పెళ్లి చేసుకున్న తర్వాత మరింత కలిసివచ్చిందట.  రామచంద్రరావు ఆర్థికంగా బాగా లేని టైంలోనే గల్లా మాధవి ఆయనను పెళ్లి చేసుకుని ఈమె తీసుకువచ్చినటువంటి కొంత ల్యాండ్ ద్వారా రామచంద్రరావు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి ఎంతో ఎదిగారు. తర్వాత టిడిపిలో ఉంటూ కాస్త పేరు తెచ్చుకొని చివరికి తన భార్యకు టికెట్ వచ్చేలా చేశారు. అలాంటి గల్లా మాధవి తాను చేసిన వైద్య సేవలు మరియు దూకుడు మాటలతో  గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి విడదల రజినిని  ఓడించి పశ్చిమ నియోజకవర్గంలో జెండా ఎగరవేసింది. అలాంటి మాధవి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తాను ఎమ్మెల్యేలను ఏ విధమైనటువంటి అహంకార భావం చూపించకుండా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ ముందుకు వెళ్తోంది.. మరి మాధవి చేసే అభివృద్ధి, సేవా కార్యక్రమాల గురించి ఇప్పుడు చూద్దాం.
 ఐలమ్మ పౌరుషం మాధవి సొంతం:
 గల్లా మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే తనకు వచ్చినటువంటి మొదటి జీతాన్ని  పేద ప్రజల కోసం కేటాయించి బళా అనిపించుకుంది. అంతేకాదు అధికారులు, తన కింది ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే పేద ప్రజల పట్ల సానుభూతి భావంతో ఉండాలని, ఎలాంటి పథకాలు వచ్చిన తప్పక అందజేయాలని గట్టిగానే చెబుతూ వస్తోంది. అలాంటి మాధవి పలు కార్యక్రమాల్లో కూడా మాట్లాడుతూ  నేను గల్లా మాధవినా, పిడుగురాళ్ల మాధవినా అనే విషయాన్ని మీరు అడగకండి. గల్లా మాధవి పక్కన ఎమ్మెల్యే అనే పదానికి కూడా మర్చిపోండి. నేను ఒక చాకలి ఐలమ్మలా పోరాటం చేసే వ్యక్తిలా నన్ను గుర్తుంచుకోండి. మీలో కలుపుకోండి. అందరం కలిసి పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిద్దామంటూ చెప్పుకొస్తోంది. అంతే కాదు విజయవాడ వరద బాధితుల కోసం నియోజకవర్గ వ్యాప్తంగా పిలుపునిచ్చి  తన వంతు సహకారం అందించడం కాకుండా  రాజకీయ నాయకులు, వ్యాపారస్తుల నుంచి కూడా సహకారం కోరి దాదాపు 20 లక్షల విలువైనటువంటి  సామాగ్రిని విజయవాడ బాధితులకు అందించింది. ఈ విధంగా గల్లా మాధవి అభివృద్ధిలోనే కాకుండా సహాయ కార్యక్రమాల్లో కూడా ముందుకు వెళుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: