జగన్ కు షాక్.. వైసీపీకి ముద్రగడ గుడ్ బై ?

frame జగన్ కు షాక్.. వైసీపీకి ముద్రగడ గుడ్ బై ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయిన తర్వాత....అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే వైసీపీ పార్టీ పరిమితమైంది. అటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకొని... దారుణ పరిస్థితిలను ఎదుర్కొంటోంది వైసిపి.
 
ఇక ఏపీలో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత... ఆ పార్టీలో ఉన్న కీలక నేతలు అందరూ జంప్ అవుతున్నారు. ఇప్పటికే దొరబాబు, ఆళ్ల నాని లాంటి కీలక నేతలందరూ వైసిపి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అంతేకాదు.. మొన్న వైసీపీ రాజ్యసభ సభ్యులు ఇద్దరు రాజీనామా చేయ డం మ నం చూసాం. మరి కొంతమంది వైసీపీ నేతలు కూడా జారుకునే ఛాన్స్ ఉందట. అటు.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా వైసీపీ పార్టీ  కి రాజీనామా చేసే యోచనలో ఉన్నారట.
 
అయితే ఇలాంటి నేపథ్యంలో వైసీపీ పార్టీ అధినేత  వైయస్ జగన్మోహన్ రెడ్డికి పిఠాపురం నియోజక వర్గంలో  మరో ఎదురు దెబ్బ తగిలినట్లు సమాచారం అందుతోంది. తాజాగా పిఠాపురం వరద బాధితులను ఆదుకునేందుకు వైసీపీ పార్టీ అధినేత  జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా చాలామంది బాధితులకు ఆర్థిక సహాయం కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు.
 
అయితే వైసీపీ పార్టీ అధినేత  జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గం లో పర్యటించిన సందర్భంగా ముద్ర గడ పద్మనాభం మాత్రం కనిపించలేదు.  ఆయన సొంత నియోజకవర్గంలో  జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తే... ముద్రగడ పద్మనాభం రాకపోవడంతో అందరిలోనూ కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ముద్రగడ పద్మనాభం గుడ్ బై చెప్పారా అని కొంతమంది అంటున్నారు. లేక రాజకీయాల నుంచి ముద్ర గడ పద్మనాభం పూర్తిగా తప్పుకున్నారా అని కూడా కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: