వైసీపీకి కొత్త ట్రబుల్ షూటర్ !

frame వైసీపీకి కొత్త ట్రబుల్ షూటర్ !

Chakravarthi Kalyan

ప్రతి పార్టీకి ట్రబుల్ షూటర్ ఉంటారు. పార్టీలో పరిస్థితులన్నీ చక్కబెట్టేందుకు ఆ ట్రబుల్ షూటర్ చేసే ప్రయత్నాలు చాలా వరకు పార్టీని గాడిలో పెడతాయి. వైసీపీలో ఇప్పటి వరకు ఆ పాత్రను సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి లు నిర్వర్తించేవారు. కానీ ఎన్నికల  ఫలితాల అనంతరం వారిద్దరూ పెద్దగా బయట కనిపించడం లేదు.


దీంతో ఇప్పుడు ఆ పదవి మాజీ మంత్రి విడుదల రజినీకి వచ్చింది. ఎవరు అసంతృప్తికి గురైనా చర్చల కోసం వైసీపీ అధినేత విడుదల రజినిని పంపుతున్నారు. బాలనేని శ్రీనివాసరెడ్డి మాజీ సీఎం జగన్ కి అత్యంత సమీప బంధువు. ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని.. ప్రచారం నడిచింది. జగన్ తో కూడా ఆయన పలుమార్లు సమావేశం అయ్యారు. ఆ తర్వాత ప్రచారం మరింత తగ్గకపోగా పెరిగింది. హైదరాబాద్ లో తన అనుచరులతో బాలినేని సమావేశం అయ్యారని తెలిసింది. దీంతో వెంటనే పార్టీ తరఫున విడుదల రజిని చర్చలకు వచ్చారు.


బాలినేని శ్రీనివాస్ తో మంతనాలు జరిపారు. ఇంట్లో నుంచి బయటకు వస్తున్న సమయంలో ఓ మీడియా ప్రతినిధి ఆమెను ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పకుండా కారు ఎక్కి వెళ్లిపోయారు. ఇక ముందు కూడా వైసీపీలో ఆమె ట్రబుల్ షూటర్ గా కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది.


ప్రస్తుతం వైఎస్ జగన్ పార్టీని ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పార్టీలో పలువురు సీనియర్లను పక్కన పెడుతున్నారు.  తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినా కూడా కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ ను జగన్ రజినికి అప్పజెప్పారు. బంధువైన బాలినేని జగన్ నచ్చ చెబితేనే వినలేదు.. విడుదల రజిని చెప్తే వింటారా అనే డౌట్ రావొచ్చు. కానీ.. చెప్పే పద్ధతిలో చెప్తే వింటారు. అలా చెప్పి పార్టీని గట్టెక్కించే వారిని ట్రబుల్ షూటర్ అంటారు. రజినికి ఇలాంటి తెలివితేటలు ఉన్నాయని గుర్తించిన జగన్ కీలక బాధ్యతలు అప్పజెప్పారని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: