ఏపీ: మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. అక్కడికంటే చౌక ధరకే..!
కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలలో కంటే ఆంధ్రాలో మరింత తక్కువ ధరలకు ఇచ్చేలా మద్యాన్ని కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తూందట. ఇప్పటికే ఆ ప్రాంతాలలో అమలవుతున్న లిక్కర్ పాలసీని కూడా కూటమి ప్రభుత్వం ఒకసారి పరిశీలించి తగిన నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం విధానాన్ని అమలులోకి తీసుకువచ్చేలా కూటమి ప్రభుత్వం భావిస్తోందట. ఏపీలో ఈనెల ఆఖరికి పాత మద్యం పాలసీ ఆగిపోతుంది. అలా కొత్త లిక్కర్ పాలసీ అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి కాబోతోంది.
ఈ నూతన లిక్కర్ పాలసీ పైన ఇప్పటికే రెండుసార్లు క్యాబినెట్ సమావేశాలు జరిగాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈనెల 17వ తేదీన మరొకసారి క్యాబినెట్ నిర్వహించి ఆఖరి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుపుతున్నారు. ముఖ్యంగా మద్యం షాపుల దరఖాస్తుల ఫీజు, నాన్ రిఫండబుల్ చార్జీలు లైసెన్సు రుసుములు ఎలా ఉండాలి అనే విషయాల పైన అధికారులు పరిశీలించబోతున్నారట. అలాగే కొన్ని కొత్త బ్రాండ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేలా కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తుందట. గత ప్రభుత్వం మద్యం విధానాన్ని ఆదాయం పెంచుకునేందుకు ఉపయోగించిందని..సరైన మద్యం లేక ప్రజల ఆరోగ్యం దెబ్బతినిందని అందుకే ఈ కొత్త లిక్కర్ పాలసీని తీసుకువచ్చేలా కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తాం అంటూ కూటమినేతలు తెలియజేస్తున్నారు