ఇప్పటికీ సైన్స్ ఈ ఆలయం యొక్క మిస్టరీని కనిపెట్టలేకపోయింది?
భారతదేశం వేదభూమి అని నానుడి. ఇక్కడ హిందూ దేవాలయాలకు సంబంధించి అనేక ప్రత్యేకతలు ప్రాచుర్యంలో ఉంటాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని దేవాలయాలు కొన్ని రహస్యాలకు నెలవు. కొన్ని దేవాలయాలలో వింత వింత శబ్దాలు వినబడగా, మరికొన్ని దేవాలయాలలో శివ లింగం లేదా విగ్రహాల సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక మరికొన్ని దేవాలయాల్లో అయితే గాల్లో స్థంబాలు నిలబడి ఉంటాయి. ఇక నిధి నిక్షేపాలు గురించి అయితే వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇలా అనేక రహస్యాలు దాచుకున్న ఆలయాలకు చెందిన మిస్టరీలను కొన్నిటిని నేటికీ ఎటువంటి సైన్స్ ఛేదించలేదు అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఇక అటువంటి నిగూఢ దేవాలయాలలో కాల భైరవ ఆలయం ఒకటి. ఈ ఆలయం వెలుపల ఏడాది పొడవునా మద్యం అమ్ముతారనే విషయం అక్కడికి వెళ్లినవాళ్ళకి తప్పితే అందరికీ తెలియదు. అంతేకాకుండా ఇక్కడ మరో గమ్మత్తు కూడా ఉంది. ఈ ఆలయంలో ఉన్న విగ్రహం మద్యం తాగుతుందట. రహస్యాలతో నిండిన ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. ఈ ఆలయం పేరు కాల భైరవ దేవాలయం. శివుని ఐదవ అవతారంగా కాల భైరవ స్వామిని చెబుతూ ఉంటారు. ఈ ఆలయంలోని కాల భైరవ విగ్రహం సుమారు ఆరు వేల సంవత్సరాల క్రితం ప్రతిష్టించబడిందని అక్కడి స్థల పురాణం చెబుతుంది.
ఈ సంప్రదాయం వలనే ఈ ఆలయంలో దేవునికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పించే ఆచారం ఎప్పటినుండో ఉంది. ప్రతిరోజూ కాలభైరవుడికి మంత్రాలు జపించిన తరువాత.. దాదాపు 2,000 మద్యం బాటిళ్లను సమర్పిస్తారు. ఈ క్రమంలోనే కాల భైరవుడు మద్యపానం సేవిస్తాడు. ఈ ఆలయ రహస్యాన్ని ఇప్పటి వరకు పరిశోధనలు చేస్తున్న పురావస్తు శాఖ కూడా కనిపెట్టలేకపోయిందని అంటూవుంటారు. ఇక కాలభైరవ స్వామిని పూజించడానికి ఉత్తమ రోజులు ఆదివారం, మంగళవారంగా పరిగణిస్తున్నారు. కనుక ఈ రెండు రోజుల్లో కాలభైరవుని ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకుంటారు. ఇక మందు బాబులయితే అక్కడికి రోజూ వెళ్లి తమతమ మొక్కుబడులు తీర్చుకుంటారు.
గమనిక: పై సమాచారం అంతర్జాలంనుండి సేకరించబడినది. ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా వాస్తవమైనది అని మేము ధృవీకరించడం లేదు. కనుక మీరు ఈ విషయాలను నమ్మేముందు సంబంధిత రంగంలోని నిపుణుల అభిప్రాయాలు తీసుకోవడం మంచిది.