పామాయిల్ రైతును రాజు చేసే అడుగులు.. భారీ రాయితీలు ప్రకటించిన కేంద్రం ?

Veldandi Saikiran
*  పామాయిల్ సాగు  పెంచేందుకు తెలుగు ప్రభుత్వాలు ఫోకస్
*  టన్ను పామాయిల్ గెల  ధర రూ. 16,500 లకు పెంచేందుకు నిర్ణయం
* పామాయిల్ దిగుమతి సుంకం పెంచుతూ కేంద్రం నిర్ణయం


రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక రకాల పంటలు పండుతున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం పంట.. పండడం మనం చూస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు... ఈమధ్య కాలంలో పామాయిల్ పంటకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పామాయిల్ పంటకు ఎక్కువగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. తెలుగు రైతులకు ఈ పంట వేసే అలవాటును రెండు ప్రభుత్వాలు చేస్తున్నాయి.
 

అటు కేంద్రం కూడా రకరకాల.. ప్రకటనలు చేసి పామాయిల్ రైతులను ఉత్సాహపరుస్తుంది.  తెలంగాణలోని ఖమ్మం, మెదక్ అలాగే ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలలో ఈ పామాయిల్ పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు రైతులు.  మెదక్ జిల్లాలో అయితే పామాయిల్ సాగు కోసం రైతులకు మొక్కలు సరఫరా చేసేందుకు గాను.. ఓ ఫ్యాక్టరీని కూడా నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 

ఈ మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో 43 ఎకరాలలో ఈ నర్సరీ ప్రారంభం కాబోతుంది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ఉత్తరాంధ్రప్రదేశ్  జిల్లాలలో పామాయిల్ పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా పామాయిల్ రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పడం జరిగింది.
 

ఈ ముడి పామాయిల్ దిగుమతి సుఖాన్ని పూర్తిగా.. పెంచడం జరిగింది. ఏ దిగుమతి సుంకాన్ని.. 5.5 శాతం నుంచి 27.5 శాతానికి అమాంతం పెంచేసింది కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా రైతులకు... ఎక్కువ లాభం వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ప్రస్తుతం ఆయిల్ పాము టన్ను గెల ధర.... 14, 392 రూపాయలుగా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నిర్ణయంతో... ఆ టన్ను ధర 1500 రూపాయల నుంచి 1700 రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. అంటే గెలధర టన్నుకు 16,500 గా ఉండే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: