చుక్కల్ని తాకుతున్న టమాటా ధరలు.. రైతులకి భారీ లాభాలే.. కానీ..?

murali krishna

* టమాటా పంటకు ఎన్నడూ లేని విధంగా ఊహించని గిరాకీ
* కిలో 10 రూపాయలు నుండి 100 రూపాయలకు ఎగబాకిన టమాటా ధర
* స్థిరంగా లేని టమాటా ధరని నమ్ముకుని అప్పులపాలవుతున్న రైతులు

ఆంధ్రప్రదేశ్ లో టమాటా పంటకు ఎప్పుడు ఎలాంటి గిరాకీ ఉంటుందో చెప్పలేని పరిస్థితి.. టమాటా పంటను ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో  సాగు చేస్తుంటారు.టమాటా పంటకు ఒక్కోసారి అస్సలు గిరాకీ ఉండదు కిలో రూ.10 నుండి రూ 15 వరకు ఉండేది.. ఈ రేట్లతో టమాటా రైతులకు అస్సలు గిట్టుబాటు అయ్యేది కాదు.. దీనితో రైతులు టమాటా పంటను పండించడం తగ్గించివేశారు..టమాటా పంట తగ్గేసరికి దేశ వ్యాప్తంగా టమాటా పంటకు ఊహించని గిరాకీ వచ్చి పడింది.. కిలో రూ 100 నుండి రూ. 150 వున్న రోజులు కూడా వున్నాయి.. టమాటా ధరలు అనూహ్యంగా పెరగడంతో కోటీశ్వరులైన రైతులు కూడా వున్నారు.. పెరిగిన ధరనే నమ్ముకుని క్వింటాలు, క్వింటాలు కొని తీవ్రంగా నష్టపోయిన రైతులు కూడా వున్నారు..

దిగుబడి తగ్గితే టమాటాకు రెక్కలు వస్తాయి. అప్పుడు సామాన్యుడు జేబుకి చిల్లు పడటం ఖాయం.. టమాటా రేట్లు ఒక్కసారిగా పెరగితే చాలామంది రైతులు పంటను కాపాడుకోడానికి అష్ట కష్టాలు పడుతున్నారు....టమాటాల కోసం వచ్చిన వాళ్లు కూడా రాత్రి సమయాల్లో రావడంతో దొంగలను గుర్తించడం కష్టం అవుతుందని రైతులు చెబుతున్నారు.. అప్పులు చేసి పండించిన పంట దొంగల పాలవుతున్నాయని.. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు..దేశంలో టమాటా ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది..రాష్ట్రంలో 2023 నుండి 2024 లో 23.37 లక్షల మెట్రిక్ టన్నుల టమాటాలు ఉత్పత్తి అయ్యాయి..దీనితో దేశం మొత్తం టమాటా ఉత్పత్తిలో టమాటా వాటా 11.30 శాతంగా నమోదు అయింది..అయితే టమాటాల ధరలు ఇంత భారీగా పెరగడానికి గుజరాత్,తమిళనాడు, ఛత్తిస్ ఘడ్, మహారాష్ట్ర లో ఉత్పత్తి ఘననీయంగా తగ్గడమే అని నాబార్డు తెలిపింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: