తెలంగాణ: 'ప్రజా పాలన దినోత్సవం' పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం..!

FARMANULLA SHAIK
బ్రిటిష్ పాలకుల నుంచి భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినా.. నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్‌ (హైదరాబాద్ సంస్థానం) ప్రజలకు మాత్రం స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు మరో ఏడాదికి పైగా సమయం పట్టింది. హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్‌లో విలీనం అయ్యింది. ఈ మహత్తర ఘట్టం పూర్తవడం వెనుక కేంద్ర ప్రభుత్వం సైనిక చర్య, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కృషి ఉన్నాయి.దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిరంకుశ పాలనలోని హైదరాబాద్ ప్రజలు మరో 13 నెలల పాటు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సాహసోపేత నిర్ణయం పుణ్యమా అని సైనిక చర్యతో నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. దీంతో హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉన్న తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు.భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినప్పటికీ.. హైదరాబాద్ సంస్థానం మాత్రం మరో 13 నెలల పాటు నిజాం నిరంకుశత్వ పాలనలో మగ్గింది. చివరికి 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వ ‘ఆపరేషన్ పోలో’ సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. దీంతో సెప్టెంబర్ 17ను విమోచన దినంగా పేర్కొంటారు. 

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి నిజాం పాలనను నుంచి విముక్తి కలిగిన సెప్టెంబర్ 17పై రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను ఎలా నిర్వహించుకోవాలనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సీఎం రేవంత్ అన్నారు. ఈ రోజును కొందరు విలీన, ఇంకొందరు విమోచన దినోత్సవం అని సంబోధిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక ఈ శుభదినాన్ని ప్రజాపాలన దినోత్సవం గా జరపడం సముచితమని భావించాం. 1948లో తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి ప్రజా పాలనకు నాంది పలికారు. అందుకే ప్రజా కోణాన్ని జోడిస్తూ ఈ పేరును పెట్టాం అని తెలిపారు.ఇదిలావుండగాతెలంగాణలోని 33 జిల్లాల్లో జెండా ఆవిష్కరణ చేసే ప్రజా ప్రతినిధుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. కాగా, గత ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా హైదరాబాద్ పపరేడ్ గ్రౌండ్‌లో అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా, రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: