ఏపీ: సీబీయస్సీ విధానం రద్దుపై స్పందించిన ప్రభుత్వం..!

FARMANULLA SHAIK
ఏపీలో సీబీఎస్ఈ అనుబంధ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఈ ఏడాది రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరం (2025-26) నుంచి ఆరో తరగతి నుంచే పరీక్ష విధానంలో మార్పులు తీసుకొచ్చి, విద్యార్థుల సామర్థ్యాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పదో తరగతిలో విద్యార్థులు ఫెయిలైతే వారిపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని మంత్రి వెల్లడించారు.ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్సీ రద్దు ప్రచారంపై టిడిపి స్పందించింది. సీబీఎస్ఈ విధానం అసెస్మెంట్కు విద్యార్థులు టీచర్లను సిద్ధం చేయకుండానే జగన్ 1000 స్కూల్ లలో సీబీఎస్ఈ ఎగ్జామ్స్ మొదలుపెట్టాడు. సీబీఎస్ఈ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేసేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంతో పాటు పరీక్షల విధానంలోనూ మార్పులు చేయాలి. ఇవేమీ పట్టించుకోకుండా సీబీఎస్ఈ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. ప్రభుత్వ సీబీఎస్ఈ బడుల్లో 77,478 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారని తెలిపారు.సీబీఎస్ఈ అనుబంధ ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఇటీవల విద్యాశాఖ పరీలు నిర్వహించింది. అందులో 64 శాతం మంది తప్పారు. మొత్తం 77,478 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 49,410 మంది తప్పారు. ఈ విషయాన్ని అధికారులు మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకురావడంతో ఈ ఏడాదికి సీబీఎస్ఈ విద్యార్థులను రాష్ట్ర బోర్డు పరీక్షలకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ నేపథ్యంలో  ఏం చదివారో.. ఎక్కడ చదివారో తెలియని జగన్ ఇలాంటి లెక్చర్లివ్వడం వింతగా ఉందని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం జగన్ నిర్ణయాలు తీసుకునేవారని తన పోస్ట్లో ఎద్దేవా చేశారు. ఆ నిర్ణయాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారాయన్నారు.సీబీఎస్ఈ విధానం ప్రవేశపెట్టినా.. పిల్లలకు పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్యాలు పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచించలేదని, ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని అన్నారు. జగన్ నిర్ణయం వల్ల ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 75వేల మంది టెన్త్ క్లాస్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని లోకేష్ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: