ఈ వినాయకుడిని.. నిమజ్జనమే చెయ్యరు తెలుసా?
అయితే వినాయక చవితి సమయంలో వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించుకున్న ప్రతి ఒక్కరు కూడా తొమ్మిది రోజులపాటు నిష్టగా పూజలు చేసి ఆ వినాయకుడి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం చూస్తూ ఉంటాం. ఇది ఎన్నో రోజులుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయం అని చెప్పాలి. అయితే వినాయకుడిని ఇలా నీటిలో నిమజ్జనం చేయడం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా చాలామంది బాధతోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉంటారు. కానీ వినాయకుడిని నిమజ్జనం చేయకుండా పెట్టుకోవడం చూశారా.. అలా ఎలా చేస్తారు అలా చేస్తే అది సాంప్రదాయానికి విరుద్ధమే అవుతుంది అంటారు ఎవరైనా.
కానీ ఇక్కడ మాత్రం అదే జరుగుతుంది నిమజ్జనమే చేయకుండా గత 75 ఏళ్లుగా వినాయకుడి విగ్రహాన్ని భద్రపరుస్తూ ఉన్నారు. ఇది ఎక్కడో కాదు మన తెలంగాణలోనే నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిర్పెల్లికి దగ్గరలో ఉన్న పాలాజ్ లో కర్ర వినాయకుడిని పూజిస్తారు. ప్రతిఏటా చవితికి బీరువాలో భద్రపరిచిన కర్ర వినాయకుడిని బయటకు తీసి 11 రోజులపాటు ప్రత్యేక పూజలు చేస్తారు. నవరాత్రుల చివరి రోజు వాగుకు తీసుకువెళ్లి నీళ్లు చల్లి మళ్లీ వినాయకుడి విగ్రహాన్ని తీసుకువచ్చి బీరువాలో భద్రపరుస్తారు. ఇలా 75 ఏళ్లుగా వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా భద్రపరుస్తూ ప్రతి ఏటా ప్రతిష్టిస్తూనే ఉన్నారు.