తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌..ఇక ఆ టికెట్లు ?

Veldandi Saikiran
తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త అందించింది టీటీడీ పాలక మండలి. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు లక్షల్లో భక్తులు వస్తున్న తరుణంలోనే.. తాజాగా కీలక ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి. ఇవాళ్టి నుంచి 27వ తేది వరకు ఆన్ లైన్ లో డిసెంబర్ నెలకు సంభందించిన దర్శన టిక్కెట్లు విడుదల రిలీజ్‌ చేయబోతున్నట్లు ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

ఇవాళ లక్కి డిఫ్ విధానం లో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి. అంటే.. ఈ నెల 21వ తేది ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లు విడుదల చేబోతుంది టీటీడీ పాలక మండలి.  ఈ నెల 21వ తేది మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల చేయనున్నారు టీటీడీ పాలక మండలి అధికారులు.

అటు.... ఈ నెల 23వ తేది ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షణ టిక్కెట్లు విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు టీటీడీ పాలక మండలి అధికారులు. ఇక అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల కూడా రిలీజ్‌ చేస్తారు.  అదే రోజున మధ్యా హ్నం 3 గంటలకు వయోవృద్ధులు ,వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల చేయనునంది టీటీడీ పాలక మండలి.

ఇక ఈ నెల 24 వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల చేస్తుంది టీటీడీ పాలక మండలి.  అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటా విడుదల కానుందట. ఈ నెల 27వ తేదీ ఉదయం శ్రీవారి సేవా కోటా విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: