జమిలి ఎన్నికల పై.. క్లారిటీ ఇచ్చేసిన అమిత్ షా.. సిద్ధం కావాల్సిందే..?

Divya
గత వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయని జమిలి ఎన్నికలు జరగబోతున్నాయనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర పార్టీ బిజెపి కూడా ఈ విషయం పైన ఆసక్తిగా ఉందనే విధంగా వార్తలు తెలియజేయడంతో దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి.. అందులో హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు మొదలైనది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ మొదటి విడత పోలింగ్ ఈ రోజున మొదలు అయ్యింది.

ఆ వెంటనే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇలాంటి సమయంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన కేంద్రం ప్రభుత్వం దృష్టి పెట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా జమిలి ఎన్నికలు నిర్వహించడానికి ప్లాన్ చేసిన ఎందుకు అది కుదరడం లేదు. అయితే ఇప్పుడు తాజాగా కేంద్రం కమిటీ సిఫార్సుల ఆధారంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అన్ని రాష్ట్రాలలోని లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి నిర్వహించేలా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు అందుకు తగ్గట్టుగా ఉన్నత స్థాయి అధికారులు కూడా పనులు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ విషయాన్ని కూడా నిర్ధారించారట. మోడీ ప్రభుత్వం హయాంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ని ఖచ్చితంగా నిర్వహిస్తామంటూ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ విషయం స్పందించడమే కాకుండా త్వరలోనే అందుకు సంబంధించి అడుగులు కూడా వేయబోతున్నట్లుగా తెలియజేశారు. కేంద్రంలో బిజెపి పార్టీ ఏర్పడి 100 రోజులు కావస్తున్న సందర్భంగా మీడియాతో అమిత్ షా ఇలా మాట్లాడడం జరిగిందట. వన్ నేషన్ వన్ ఎలక్షన్  పై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేపథ్యంలోనే తుది నివేదిక అందజేయబోతున్నట్లు తెలియజేశారు అమిత్ షా. దీంతో రాబోయే రోజుల్లో దేశమంతటా ఎన్నికలకు ముఖ్య నేతలు సిద్ధం కావాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: