ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉదయం 11 గంటలకు మొదలైంది. సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పలు ప్రధాన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ముఖ్యంగా రాష్ట్రంలో న్యూ లిక్కర్ పాలసీ నివేదికకు ఆమోదం తెలిపారు.అలాగే నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని, సగటున మద్యం ధర రూ.99 గా(క్వాటర్) ఉండాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. వంద లోపు నాణ్యమైన మద్యం అందుబాటులోకి రావడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.అలాగే భోగాపురం విమానాశ్రయానికి అల్లురి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయించారు. కౌలు రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకోగా.. వాలంటీర్ వ్యవస్తపై సూదీర్ఘంగా చర్చ, బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌పై కూడా చర్చించిన కేబినెట్.. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.అలాగే మరికొన్ని అంశాలపై కూడా మంత్రులతో సీఎం చర్చించారు. చివరకు ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.ఆపరేషన్ బుడమేరు అంశం పై కూడా కేబినెట్ చర్చించింది. ఇలాంటి విపత్తులు మరోసారి ఎదురుకాకుండా చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు చర్చించారు. దీని కోసం కార్యచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇవి కాకుండా పారిశ్రామిక అభివృద్ధి, విద్యుత్ సంస్కరణలపై కూడా మంత్రిమండలి సమాలోచనలు జరుపుతోంది. వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో తీసుకున్న నిర్ణయాలు, మంత్రుల గ్రాఫ్, ఎమ్మెల్యేల పని తీరు ఇలా అన్నింటిపై కూలంకుశంగా మాట్లాడుకున్నారు. జనసేన మంత్రుల గ్రాఫ్‌ను చంద్రబాబుకు పవన్ కల్యాణ్ అందజేశారు. ఈనెల 20వ తారీకుతో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100రోజులు కానుండడంతో ఇప్పటివరకూ చేసిన పనులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.ఇదిలా ఉంటేవాలంటీర్ వ్యవస్థపై సుదీర్ఘ చర్చఏపీ కేబినెట్ సమావేశానికి ముందు మంత్రి నారా లోకేష్.. ఇతర మంత్రులతో తన ఛాంబర్ లో సమావేశమయ్యారు. ఆయన నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు మంచి స్పందన వస్తోందని, ప్రజలు తనకు ఇచ్చిన వినతులను సంబంధిత మంత్రులకు అందజేసి.. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.